- Telugu News Photo Gallery Smartphone destroy your Relationship called as Phubbing Telugu Lifestyle News
Lifestyle: పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోన్న స్మార్ట్‌ఫోన్.. దీనిని ఏమంటారో తెలుసా.?
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మనుషులు జీవితాల్లో ఓ భాగమైపోయింది. తినకుండా అయినా ఉంటున్నారు కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండని పరిస్థితులు వచ్చేశాయ్. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్‌తోనే ఉంటున్నారు. స్మార్ట్‌ఫోన్ రాకతో మనుషుల జీవితాలు ఎంత సింపుల్‌గా మారాయో, అంతే కాంప్లికేట్‌గా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడో ఉన్న వారిని దగ్గర చేస్తున్న ఫోన్‌లను పక్కన ఉన్న వారినే దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా భార్య, భర్తల మధ్య అగాదానికి కారణమవుతున్నాయి.
Updated on: Aug 12, 2023 | 11:34 AM

స్మార్ట్ ఫోన్‌లు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. పెళ్లైన దంపతుల మధ్య గొడవలకు మొబైల్ కారణంగా నిలుస్తోంది. ఇలా స్మార్ట్ ఫోన్ కారణంగా జంటల మధ్య గొడవలు రావడాన్ని ఫబ్బింగ్ అని పిలుస్తారు.

ఈ ఫబ్బింగ్ కారణంగా దాంపత్య జీవితాల్లో ఎన్నో గొడవలకు కారణంగా మారుతుంది. ముఖ్యంగా శృంగార జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఫబ్బింగ్ కారణంగా భాగస్వాముల మధ్య దూరం పెరుగుతుంది. ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల భాగస్వామిని పట్టించుకోరని, దీంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం తగ్గే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

అంతేకాకుండా భావోద్వేగాలు ఉండాల్సిన చోట స్మార్ట్ ఫోన్ రావడంతో ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ తగ్గుతుంది. భాగస్వామి సమస్యలను అర్థం చేసుకోకపోవడం, సోషల్ మీడియా అనే ఊహా ప్రపంచంలో గడపడం జంటల మధ్య గొడవలకు కారణంగా మారుతుందని చెబుతున్నారు.

ఇదిలాగే కొనసాగితే బంధాలు శాశ్వతంగా దూరమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భాగస్వామికి తగినంత సమయం కేటాయిస్తూ, స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉంటూ వాస్తవ ప్రపంచంలో జీవించకపోతే బంధం తెగిపోవడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.





























