Skincare: ఆరోగ్యానికే కాదు, ఆందానికి కూడా డ్రాగన్ ఫ్రూట్..! ఇలా ఉపయోగించారంటే మెరిసే చర్మం మీ సొంతం..
Skincare tips: డ్రాగన్ ఫ్రూట్ రుచికరమైనదే కాకుండా చాలా పోషకాలను కలిగిన పండు. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. డ్రాగన్ ఫ్రూట్‌తో ఆరోగ్యమే కాక ఆందం కూడా మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ ఇ, విటమిస్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను దూరం చేయడంతో పాటు మెరిసే మేని ఛాయను అందిస్తాయి.
Updated on: Sep 25, 2023 | 7:32 PM

హైడ్రేటెడ్ స్కిన్: డ్రాగన్ ఫ్రూట్‌లో హైడ్రేటింగ్ గుణాలు ఉన్నాయి. చర్మంపై డ్రాగన్ ఫ్రూజ్ పల్ప్‌ని అప్లై చేయడం వల్ల ముఖానికి సహజమైన తేమ లభించి, హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

ముడతలు మాయం: డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, విటమిన్ సి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడడమే కాక చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఈ క్రమంలోనే ముడతలను కూడా తొలగించి, చర్మం బిగుతుగా ఉండేలా చేస్తాయి.

మెరిసే చర్మం: డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సడెంట్లు చర్మంపై నిర్జీవ కణాలను తొలగించి, మెరిసేలా చేస్తాయి.

ఎక్స్‌ఫోలియేటింగ్: డ్రాగన్ ఫ్రూట్‌ని స్కిన్ స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మంపై పేరుకుపోయిన నిర్జీవ కణాలు, మచ్చలు, మురికి తొలిగిపోతాయి.

ఫేస్ ప్యాక్: డ్రాగన్ ఫ్రూట్‌ని ఫేస్ మాస్క్‌లా చేసుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇందుకోసం డ్రాగన్ ఫ్రూట్‌ను గ్రైండ్ చేసి శెనగపిండి, రోజ్ వాటర్, పచ్చి పాలు జోడించాలి. పేస్ట్‌లా చేసుకుని మెడ, ముఖానికి 20 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత వేళ్లతో మసాజ్ చేసి చల్లటి నీటితో చర్మాన్ని కడగాలి.





























