చర్మం తెల్లగా కనిపించడానికి, అవసరమైన అన్ని చర్మ సంరక్షణను తీసుకున్నా.. ముఖంపై నల్లని టాన్ పూర్తిగా తొలగించదు. దీనికి విరుద్ధంగా చర్మం నిస్తేజంగా మారి మరింత నల్లగా కనిపిస్తుంది. నిజానికి, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం చర్మ సంరక్షణపై మాత్రమే దృష్టి పెడితే సరిపోదు. తినడం, త్రాగడం వంటి వాటిపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఆయిల్, స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు తినాలి.