- Telugu News Photo Gallery Menstrual Hygiene Tips: period hygiene mistakes to avoid for your menstrual health
Menstrual Hygiene Tips: చిన్న తప్పులే పెద్ద సమస్యలకు ద్వారాలు.. ఆ టైంలో ఈ తప్పులు చేయకండి
మహిళల్లో ప్రతి నెలా పీరియడ్స్ సాధారణం. ఈ సమయంలో మహిళల్లో మూడ్ స్వింగ్స్, నడుం నొప్పి, దిగువ పొత్తికడుపులో నొప్పి, కండరాల నొప్పులు వంటి ఎన్నో సమస్యలను అనుభవిస్తారు. ఇక పీరియడ్స్ సమయంలో నడుము నొప్పి చాలా సాధారణం. ఈ సమస్యలను కొన్ని సాధారణ చిట్కాలతో అధిగమించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. పీరియడ్స్ సమయంలో చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు ఆరోగ్యానికి మరింత హాని కలిగిస్తాయట. అవేంటంటే..
Updated on: Jun 11, 2024 | 1:11 PM

పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. విపరీతమైన కడుపునొప్పి, మానసిక కల్లోలంతోపాటు ముఖం మొటిమలు, దద్దుర్లు చిరాకు తెప్పిస్తాయి.

పీరియడ్స్ సమయంలో మహిళలు మూడు నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో తినడం, త్రాగడం నుంచి పరిశుభ్రత వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. పీరియడ్స్ సమయంలో ప్యాడ్ ను కనీసం ప్రతి 6 గంటలకు ఒకసారి మార్చుకోవాలి. ముఖ్యంగా వేసవిలో ఇలా చేయడం చాలా ముఖ్యం. లేదంటే యోని ఇన్ఫెక్షన్ రావచ్చు.

పీరియడ్స్ సమయంలో తరచుగా బాత్రూమ్‌కి వెళ్లకుండా ఉండేందుకు చాలా మంది తక్కువ నీరు తాగుతారు. కానీ, ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. నీరు ఎక్కువగా తాగడం వల్ల పొత్తికడుపు నొప్పి నుంచి కండరాల తిమ్మిరి వరకు అనేక సమస్యలు తగ్గుతాయి. అయితే చాలా మంది పీరియడ్‌లో పదే పదే వాష్‌రూమ్‌కి వెళ్లేందుకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తక్కువ నీరు తాగుతారు. కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

పీరియడ్స్ సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బలహీనత, అలసటను అధిగమించడానికి శరీరానికి అదనపు పోషకాలు కూడా అవసరం. కాబట్టి ఈ సమయంలో ఆహారంలో పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి. ఈ సమయంలో ఎక్కువగా వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.

పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయాలా.. వద్దా..? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారీ వ్యాయామం లేకుండా పీరియడ్ సమయంలో తేలికపాటి వ్యాయామం చేయవచ్చు. ఈ కాలంలో ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల పొత్తికడుపులో నొప్పి సంభవిస్తుంది. పీరియడ్స్ దుర్వాసనను నివారించడానికి చాలా మంది బాడీ డియోను ఉపయోగిస్తారు. కానీ ఇవి వినియోగించకూడదు. ఎందుకంటే ఈ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు యోనిలోని pH స్థాయిని తగ్గించి, స్కిన్ ఇరిటేషన్ తో పాటు ఇన్ఫెక్షన్ కూడా కలిగిస్తుంది.




