AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: చిటికెలో మీ అందాన్ని రెట్టింపు చేసే టిప్స్.. పార్లర్‌కి వెళ్లకపోయినా మెరిసే అందం మీ సొంతం

ఇంటాబయటా ఒంటరిగా పనులను చక్కదిద్దడం అంతసులువేం కాదు. ఈ క్రమంలో అందంపై శ్రద్ధ వహించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. టైం సరిపోకపోవడంతో పార్లర్‌కి ఏడాదికి ఒకసారి మాత్రమే వెళ్తుంటారు. దీని వల్ల చర్మానికి అంతగా ప్రయోజనం ఉండదు. కానీ ప్రతి నెలా క్రమం తప్పకుండా ఫేషియల్ చేయించుకుంటే చర్మానికి మేలు జరుగుతుంది. ఐతే అందుకు తగినంత సమయం లేకపోతే ఇంట్లోనే కేవలం ఒక్క నిముషంలో..

Srilakshmi C
|

Updated on: Sep 15, 2023 | 12:37 PM

Share
ఇంటాబయటా ఒంటరిగా పనులను చక్కదిద్దడం అంతసులువేం కాదు. ఈ క్రమంలో అందంపై శ్రద్ధ వహించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. టైం సరిపోకపోవడంతో పార్లర్‌కి ఏడాదికి ఒకసారి మాత్రమే వెళ్తుంటారు. దీని వల్ల చర్మానికి అంతగా ప్రయోజనం ఉండదు. కానీ ప్రతి నెలా క్రమం తప్పకుండా ఫేషియల్ చేయించుకుంటే చర్మానికి మేలు జరుగుతుంది.

1 / 5
ఐతే అందుకు తగినంత సమయం లేకపోతే ఇంట్లోనే కేవలం ఒక్క నిముషంలో మీ అందానికి మెరుగులు దిద్దవచ్చు. దీని తర్వాత ఫేషియల్ కోసం పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్-ఈ 3 దశలను అనుసరించడం వల్ల చర్మానికి సంబంధించి అనేక సమస్యలను నివారించవచ్చు. ఈ మూడు స్టెప్పులు పాటిస్తే ఫేషియల్ అవసరం ఉండదు.

2 / 5
మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి తేలికపాటి క్లెన్సర్‌ను ఎంచుకోవాలి. చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. తర్వాత క్లెన్సర్‌ని ముఖంపై అప్లై చెయ్యాలి. అందుకు కేవలం 15 సెకన్లు మాత్రమే పడుతుంది.

3 / 5
తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. టోనర్‌ని నేరుగా ముఖంపై స్ప్రే చేసుకోవచ్చు. 1-2 సెకన్లలో గ్రహిస్తుంది. అలాగే కాటన్ బాల్‌తో టోనర్‌ని ముఖంపై అప్లై చేసుకోవాలి.

4 / 5
చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచడం చాలా అవసరం. అందుకు మాయిశ్చరైజర్ ఉపయోగపడుతుంది. మీ చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ని ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం తాజాగా ఉండటమే కాకుండా కాంతులీనుతుంది.

5 / 5