- Telugu News Photo Gallery Cinema photos Actress Janhvi Kapoor comments on her thriller movie ulajh Telugu Actress Photos
Janhvi Kapoor: కల నెరవేరబోతుందన్న జూనియర్ శ్రీదేవి.. ఎన్టీఆర్ మీద కూడా చాల ఆశలు..
స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. స్టార్ ఇమేజ్ అందుకోవటంలో మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నారు. అయితే అప్ కమింగ్ మూవీతో తన కల నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఈ బ్యూటీ. అందుకే ఆ సినిమా ప్రతీ అప్‌డేట్‌ను ఫ్యాన్స్‌ను గ్రాండ్‌గా షేర్ చేసుకుంటున్నారు.సక్సెస్ పరంగా తన సినిమాలు తడబడినా.. నటిగా ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు జూనియర్ అతిలోకసుందరి జాన్వీ కపూర్.
Updated on: Sep 15, 2023 | 1:01 PM

స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. స్టార్ ఇమేజ్ అందుకోవటంలో మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నారు. అయితే అప్ కమింగ్ మూవీతో తన కల నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఈ బ్యూటీ.

అందుకే ఆ సినిమా ప్రతీ అప్‌డేట్‌ను ఫ్యాన్స్‌ను గ్రాండ్‌గా షేర్ చేసుకుంటున్నారు.సక్సెస్ పరంగా తన సినిమాలు తడబడినా.. నటిగా ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు జూనియర్ అతిలోకసుందరి జాన్వీ కపూర్.

తొలి సినిమా దడక్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ స్టార్ కిడ్, తరువాత డిఫరెంట్ మూవీస్‌తో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న జాన్వీ... ఆ జానర్‌లో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు పడటంతో ఎక్కువగా విమెన్ సెంట్రిక్ కథలతోనే జాన్వీని అప్రోచ్ అవుతున్నారు మేకర్స్. లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేయాలన్న కండిషన్ పెట్టుకోకపోయినా... ఆ జానర్ సినిమాలు చేయటం తనకు కూడా ఇష్టమే అంటున్నారు జూనియర్ శ్రీదేవి. అలా అని గ్లామర్ రోల్స్ చేయనని కాదు అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు.

లేడీ ఓరియంటెడ్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కల తన నెక్ట్స్ మూవీతో తీరుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు జాన్వీ. ఈ బ్యూటీ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా నటిస్తున్న సినిమా ఉలజ్. థ్రిల్లర్ జానర్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా తన అనుభవాలను షేర్ చేసుకున్నారు జాన్వీ.

ఉలజ్‌తో పాటు జాన్వీ టాలీవుడ్ డెబ్యూ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాతో సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ కపూర్. ఈ సినిమాతో కమర్షియల్ ఫార్మాట్‌లోనూ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నారు.




