Eggs: గుడ్లను అతిగా తింటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?

కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కచ్చితంగా కోడి గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ కచ్చితంగా కోడి గుడ్లను తీసుకోవాలని చెబుతారు. అయితే ఆరోగ్యానికి మంచిదని కోడి గుడ్లను అధికంగా తీసుకోవడం ఏమాత్రం మంచిదని నిపుణులు చెబుతున్నారు...

Narender Vaitla

|

Updated on: Sep 24, 2024 | 12:36 PM

కోడి గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అందుకే నాన్‌ వెజ్‌ తీసుకోని వారు కూడా కోడి గుడ్లను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వైద్యులు సైతం కోడి గుడ్లను తీసుకోవాలని సూచిస్తారు

1 / 5
అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని కోడి గుడ్లను అతిగా తింటే మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజులో ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ గుడ్లను తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు.

2 / 5
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మూత్రంలో నురుగు ఏర్పడటం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా మూత్రం రంగు కొద్దిగా ముదురుగా ఉంటుంది. వీటిల్లో ఏదైనా లక్షణం కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

3 / 5
కోడి గుడ్లను అతిగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పరిమితికి మించి గుడ్లను తింటే కడుపుబ్బరం, కడుపులో నొప్పి, గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలు పెరుగుతాయి. మలబద్ధకం బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి.

4 / 5
గుడ్డులో ఉండే పచ్చ సొనలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. అందుకే వీటిని మితంగా తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మాత్రం శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా శారీరక శ్రమ తక్కువగా చేసే వారు గుడ్లను మితంగా తీసుకోవడం మంచిది.

5 / 5
Follow us