ఏ డ్రెస్ వేసుకున్న షూ ధరిస్తే కంఫర్ట్‌గా ఉంటుంది. రోజంతా షూ ధరించి ఉండటం వల్ల సాక్స్, బూట్ల నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఉతికినా వాసన త్వరగా వదిలిపోదు. చెమట వాసన అంత తేలికగా పోదు. అదే సమయంలో, స్మెల్లీ బూట్లు ఉంచడం వల్ల షూ రాక్ వాసన వస్తుంది. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు, స్ప్రేలు, రూమ్ ఫ్రెషనర్ స్ప్రేలు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సహజ సిద్ధంగా తయారు చేసుకునే ఈ నేచురల్ రెమెడీస్‌తో షూ నుంచి వచ్చే దుర్వాసనను నిమిషాల్లో వదిలించుకోవచ్చు.