- Telugu News Photo Gallery Science photos Sea mammales manatees are in dangerous situation due to water polution in florida
Manatee: ప్రమాదంలో సముద్రపు ఆవులుగా చెప్పుకునే మనాటీల మనుగడ..జంతు ప్రేమికుల్లో ఆందోళన
Manatees: నీటి కాలుష్యం అనేక జలచరాలకు శాపంగా మారింది. సముద్రాలలో జీవించే క్షీరదాలు క్రమేపీ తమ ఉనికిని కోల్పోయేలా పరిస్థితి మారిపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
Updated on: Jul 16, 2021 | 3:01 PM

ఫ్లోరిడాలో ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్యలో సముద్ర క్షీరదాల (మనాటీ)లో కనీసం 841 మరణించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో 2013 లో హానికరమైన ఆల్గేకి గురైన 830 మనాటీలు మృతి చెందాయి. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.

పెరుగుతున్న నీటి కాలుష్యం కారణంగా ఈ సంవత్సరం మనాటీలు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నాయని జీవశాస్త్రవేత్తలు అంటున్నారు. ఫ్లోరిడా జలమార్గాలలో పెరుగుతున్న వ్యర్థాలు జలాలను కలుషితం చేయడం ప్రధాన సమస్య అని వారు చెబుతున్నారు. ఇది ఆల్గే పేరుకుపోవడం, అదేవిధంగా మనాటీల ఆహారం అయిన సీగ్రాస్ కోల్పోవడాన్ని ప్రేరేపిస్తుంది.

ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు మాట్లాడుతూ చాలా మనాటీల మరణాలు చలి నెలల్లో జరిగాయని చెప్పారు. మనాటీలు ఇండియన్ రివర్ లగూన్ కు వలస వచ్చినప్పుడు, అక్కడ చాలా వరకూ సముద్రపు గాలులకు చనిపోయాయని చెప్పారు.

ఉష్ణోగ్రతలు పెరిగినపుడు, జంతువులు అట్లాంటిక్ తీరం వెంబడి చెదరగొట్టడంతో అవి పడవ దాడులకు గురయ్యాయని అధికారిక డేటా చెబుతోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు సముద్రపు ఆవులు అని కూడా పిలువబడే కనీసం 63 మనాటీలను పడవలు కొట్టి చంపాయి. పడవ దాడులు ఈ సముద్రపు ఆవుల పాలిట మ్రుత్యువులుగా మారాయని పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి.

అక్కడి ప్రభుత్వం 2017 లో మనాటీల రక్షణ్ కోసం చర్యలు ప్రారంభించింది కానీ, అవి ఏమాత్రం సరిపోవని పరిశోధకులు చెబ్తున్నారు. మనాటీ ఒక పెద్ద, నెమ్మదిగా కదిలే సముద్ర క్షీరదం. దీనిని సముద్ర ఆవు అని కూడా పిలుస్తారు. ఇది ఫ్లోరిడాకు అనధికారిక చిహ్నంగా మారింది. ప్రస్తుతం 6,300 మంది మనాటీలు ఫ్లోరిడా జలాల్లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.