- Telugu News Photo Gallery Science photos Researches found interesting thing about astronaut spending more time in space could shrink heart size
Heart Shrink: వారిలో గుండె పరిమాణం తగ్గిపోతోంది.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోధకులు..
Heart Shrink: అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించే వారిలో గుండె పరిమాణం తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. భూమాకర్షణ బలం లేకపోవడం దీనికి కారణమని అధ్యయనాల్లో వెల్లడైంది.
Updated on: Apr 01, 2021 | 3:37 PM

ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపిన వ్యామగాముల గుండె పరిమాణం తగ్గిపోతోందని తాజా పరిశోధనల్లో తేలింది.

అంతరిక్షంలో భూమాక్షరణ లేకపోవడం కారణంగా రక్తం పాదాలవైపు ప్రయాణిస్తుందని, ఈ కారణంగానే గుండె గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా దాని ఆకారాన్ని నిలుపుకుంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం.

దీంతో శరీరమంతా రక్తాన్ని పంపింప్ చేసే క్రమంలో అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో.. రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫలితంగా కణాలు, కణజాలం వీటిలో తగ్గిపోతాయి.

ఈ కారణంగానే గుండె పరిమాణం తగ్గుతుందని పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు.

టెక్సాస్‌లోని సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు 340 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన ఒక వ్యోమగామిపై పరిశోధనలు చేసిన అనంతరం ఈ విషయాలను వెల్లడించారు.

పరిశోధనల్లో తేలిన వివరాల ప్రకారం.. వ్యోమగామి, గజ ఈతగాడిలో గుండె రెండు ఎడమ జఠరికల కణాలు, కణజాలాల్లో తగ్గుదల ఉందని పరిశోధనలో వెల్లడైంది. జఠరికల వెడల్పు తగ్గినట్లు గుర్తించారు.




