- Telugu News Photo Gallery Science photos Human Body Part Know About Liver Regrowth and How Does The Liver Regrow Itself
Human Body: బల్లి తోక పెరిగినట్లే.. మనిషిలోనూ ఓ అవయవం పెరుగుతుంది.. అదెంటో మీకు తెలుసా?..
Human Body Parts: బల్లి తోకను కత్తిరిస్తే మళ్లీ పెరుగుతుంది. కొన్ని రోజులు తరువాత యధావిధిగా ఉంటుంది. అలాగే.. మనిషి శరీరంలోనూ ఓ అవయవం విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఆ అవయం ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే.. ఇప్పుడు తెలుసుకోండి.
Updated on: Nov 03, 2021 | 10:14 PM

మనిషి శరీరంలోనే గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలెయం వంటి అవయవాలు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే, మనిషి శరీరంలో ఏ అవయవానికి లేని ప్రత్యేక లక్షణం కాలేయానికి ఉంది.

ఒకవేళ ఏవైనా కారణాలచే కాలేయం కొంత భాగాన్ని కత్తించినట్లయితే.. అది మళ్లీ పెరుగుతుంది. స్వయంచాలకంగా పూర్వ రూపాన్ని సంతరించుకుంటుంది.

వ్యక్తులు మద్యం తాగితే దాని ప్రభావం కాలేయంపై పడుతుంది. కాలేయాన్ని దెబ్బ తీస్తుంది. సాధారణంగా ఆల్కాహాల్ కాలేయం నియంత్రిస్తుంది. కానీ, అధిక మోతాదులో ఆల్కాహాల్ తీసుకున్నట్లయితే.. కాలేయంపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది.

కాలేయం ప్రత్యేకత ఏంటంటే.. దాని పని అది చేసుకుంటుంది. కాలేయంపై డ్రగ్స్, మద్యం ప్రభావం పడినట్లయితే, అది క్రమంగా క్షీనిస్తుంటుంది. కాలేయంలో 51 శాతం పునరుత్పత్తి అవుతుందని వైద్యులు చెబుతారు.

కలేయం పునరుత్పత్తి మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో అనేక జన్యువు సక్రియం చేయబడుతాయి. తద్వారా పునరుత్పత్తి ప్రారంభం అవుతుంది. కాలయంలో ఉండే కొన్ని రకాల కణాలు ఈ పునరుత్పత్తికి దోహదపడుతాయట.




