AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Benefits of Sabja Seeds: సబ్జా గింజలతో ఆరోగ్యం మాత్రమే కాదు..మీ అందం రెట్టింపు అవుతుందట..!

యవ్వనంగా కనిపించాలని, అందంగా మెరిసిపోవాలని సహజంగానే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు..ఇక ఆడవాళ్ల విషయానికి వస్తే.. ఇలాంటి ఆశలు రెట్టింపుగానే ఉంటాయనుకోండి. అందుకే ఆడవాళ్లు తరచూ బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. వందలు, వేలు ఖర్చు చేస్తూ ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌ని వాడుతుంటారు. అలాగే, కొందరు అందం కోసం ఇంటి చిట్కాలను కూడా ట్రై చేస్తుంటారు. వాస్తవానికి కూడా ఇంట్లో లభించే పదార్థాలతోనే అందం, ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా సహజంగానే అందాన్ని పెంపొందించుకోవాలంటే సబ్జా గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. సబ్జా ఆరోగ్యపరంగానే కాదు, సౌందర్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Jun 19, 2025 | 7:53 PM

Share
వాతావరణ కాలుష్యం, పొగ, దుమ్ము, ధూళి కారణంగా చర్మం కాంతిని కోల్పోతుంది. దీంతో ముఖంపై తరచూ మొటిమలు, మచ్చల సమస్యలు వేధిస్తుంటాయి. ఈ క్రమంలోనే చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేయాలంటే సబ్జా గింజలు సరైన ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జా గింజలలో ఉండే సహజ డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
కొంతమందిలో తరచూ చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అలాంటివారు క్రమం తప్పుకుండా సబ్జా గింజలను తీసుకోవడం వల్ల మంచి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.  ఇందులోని యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తాయి.

2 / 5
సబ్జా గింజల్లో విటమిన్ ఇ సమృద్ధిగా నిండి వుంటుంది. విటమిన్‌ ఇ చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ గింజల్లో విటమిన్ ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. తరచూ సబ్జా గింజలు వాడకం వల్ల చర్మానికి తగినంత పోషణ లభిస్తుంది. చర్మం ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది.

3 / 5
ప్రస్తుతం చాలా మందికి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. అలాంటి వారు సబ్జా గింజలను క్రమం తప్పకుండా వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే, ఈ గింజలతో తయారు చేసిన ఫేస్​ఫ్యాక్ వేసుకుంటే ముఖంపై ముడతలు, మచ్చలను దూరం చేస్తుంది. చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడిని కలుపుకొని ముఖానికి రాసుకుని.. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే త్వరలోనే మీరు ఊహించని మార్పును చూస్తారు.

4 / 5
సబ్జా సీడ్స్‌ కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు..జుట్టుకు కూడా మంచి పోషకాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలలోని విటమిన్ కె, బీటా కెరోటిన్, ప్రొటీన్లు - వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుంది.

5 / 5
Follow Us
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో

రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మోసం గురించి..

మందుల కొరత తప్పదా?LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!

ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !

ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?

అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు

ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే

సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం