ఆ భారతీయ రాజుకు మండింది.. ఆ ఫారిన్ కార్లకు సీన్ సితార్ అయింది..
ఆ కార్లు కేవలం సాధారణ వాహనాలు కాదు, చాలా ఖరీదైనవి, విలసవంతమైనవి కూడా. ఇది ఒక ఫారిన్ బ్రాండ్ కారు. భారతదేశంలోని ఒక రాజుకు కారణం కారణంగా ఈ కార్లు బ్రాండ్ భారీగా నష్టపోయింది. మరి ఆ ఫారిన్ కార్లు బ్రాండ్ ఏంటి.? వాటికి కలిగిన నష్టం ఏంటి.? ఆలా చేసిన రాజు భారతీయ మహారాజు ఎవరు.? ఎందుకు చేసారు.? ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం..
Updated on: Sep 24, 2025 | 9:46 PM

అతను రాజస్థాన్‌లోని అందమైన అల్వార్ రాజ్యం మహారాజు జై సింగ్ ప్రభాకర్. అతను తన కాలంలో అత్యంత శక్తివంతమైన, ధనవంతుడైన పాలకులలో ఒకడు. అతను సాహస జీవితాన్ని గడిపాడు. ఆయనకు పాలనలో జనం చాల అందంగా గడిపారు. ఆయనకు విలాసవంతమైన కార్లు అంటే చాల ఇష్టం. నచ్చిన కారు తన కోట ముంది ఉండాల్సిందే.

ఇదిలా ఉంటె 1920లో ఓ సరి పర్యటనకు లండన్ వెళ్ళాడు. ఆ సమయంలో జై సింగ్ ప్రభాకర్ సాధారణ దుస్తులు ధరించి రోల్స్ రాయిస్ షోరూమ్‌కి వెళ్లి కొన్ని కార్లు చూపించమని అడిగాడు. అయితే సేల్స్‌మెన్ అతన్ని పట్టించుకోలేదు. అతను తమ ఖరీదైన కార్లను కొనలేని పేద భారతీయుడని భావించి అతనితో దురుసుగా ప్రవర్తించాడు. జై సింగ్ ప్రభాకర్ కోపంగా షోరూమ్ నుంచి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఆయన తన రాజ వస్త్రధారణలో తన పరివారంతో షోరూమ్‌కు తిరిగి వచ్చారు. సిబ్బంది తమ తప్పును గ్రహించి ఆయనకు ఎర్ర తివాచీ వేసి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత జై సింగ్ ప్రభాకర్ ప్రదర్శనలో ఉన్న ఆరు కార్లను కొనుగోలు చేసి, అక్కడికక్కడే వాటికి డబ్బు చెల్లించారు. ఆయన మరో నాలుగు కార్లను భారతదేశానికి డెలివరీ చేయాలని కూడా ఆదేశించారు.

కార్లు భారతదేశానికి వచ్చిన తర్వాత జై సింగ్ ప్రభాకర్ వాటిని తన వ్యక్తిగత అవసరాలు కాకుండా న్యూఢిల్లీ మునిసిపాలిటీని చెత్త సేకరించడం కోసం ఉపయోగించమని ఆదేశించారు. రోల్స్ రాయిస్ కంపెనీని అవమానించాలని, వారి కార్లు తన గౌరవానికి అర్హమైనవి కాదని వారికి చూపించాలని ఆయన కోరుకున్నారు. వారి రూపాన్ని బట్టి ప్రజలను తీర్పు చెప్పకూడదని వారికి ఒక పాఠం నేర్పించాలని కూడా ఆయన కోరుకున్నారు.

రోల్స్ రాయిస్ కార్లను చెత్త ట్రక్కులుగా ఉపయోగించడం భారతదేశంతో, విదేశాలలో సంచలనం సృష్టించింది. రాజు చర్యలతో రోల్స్ రాయిస్ కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనివల్ల తమ ఖ్యాతి, అమ్మకాలు దెబ్బతింటాయని బయపడిన ఆ బ్రాండ్ అధికారులు జై సింగ్ ప్రభాకర్‌కు ఒక టెలిగ్రామ్ పంపారు. తమ సిబ్బంది ప్రవర్తనకు క్షమాపణలు చెబుతూ, చెత్త సేకరణకు తమ కార్లను ఉపయోగించడం మానేయమని కోరారు. వారు సద్భావనకు చిహ్నంగా అతనికి మరో ఆరు కార్లను ఉచితంగా అందించారు. జై సింగ్ ప్రభాకర్ వారి క్షమాపణ మరియు వారి ఆఫర్‌ను అంగీకరించారు. చెత్త సేకరణకు రోల్స్ రాయిస్ కార్లను ఉపయోగించడం మానేశాడు. వాటిని వాటి అసలు స్థితికి పునరుద్ధరించాడు.




