AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 3 మ్యాచ్‌లు 61 పరుగులు.. ఒక్క హాఫ్ సెంచరీ లేకుండా అట్టర్ ఫ్లాప్ షో.. కట్‌చేస్తే.. వన్డే ప్రపంచకప్ స్క్వాడ్ నుంచి ఔట్..?

Rohit Sharma performance vs New Zealand 2026: న్యూజిలాండ్‌తో జరిగిన ఈ సిరీస్ ఓటమి రోహిత్ శర్మకు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఒక మేలుకొలుపు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడపాల్సిన రోహిత్, తన వ్యక్తిగత ఫామ్‌ను తిరిగి పుంజుకుంటేనే రాబోయే కీలక టోర్నీల్లో భారత్ విజయకేతనం ఎగురవేయగలదు.

Venkata Chari
|

Updated on: Jan 19, 2026 | 9:49 AM

Share
Rohit Sharma’s Flop Show: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన నిర్ణయాత్మకమైన వన్డే సిరీస్ ముగిసింది. అయితే, ఈ సిరీస్ ఫలితం కంటే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కివీస్ బౌలర్లపై విరుచుకుపడే 'హిట్‌మ్యాన్', ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం ఒక్క అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేక తీవ్రంగా నిరాశపరిచాడు. కీలకమైన వరల్డ్ కప్ సన్నద్ధతలో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో రోహిత్ వైఫల్యం జట్టును ఆలోచనలో పడేసింది.

1 / 5
తడబడిన హిట్‌మ్యాన్.. చేజారిన సిరీస్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-2తో పరాజయం పాలైంది. ఇండోర్‌లో జరిగిన చివరి వన్డేలో విరాట్ కోహ్లీ (124) అద్భుత సెంచరీతో పోరాడినప్పటికీ, జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఈ సిరీస్ మొత్తం పరిశీలిస్తే, భారత టాప్ ఆర్డర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ పట్ల అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

2 / 5
మూడు మ్యాచుల్లోనూ నిరాశే: ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ గణాంకాలు అతని స్థాయికి ఏమాత్రం తగవు. మూడు వన్డేల్లో కలిపి అతను కేవలం 61 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మొదటి వన్డేలో మంచి ఆరంభం లభించినా 26 పరుగులకే అవుట్ అయ్యాడు. రెండవ వన్డేలో కేవలం 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక మూడవ వన్డేలో ఇండోర్ వంటి బ్యాటింగ్ స్వర్గధామంలో కేవలం 11 పరుగులకే అవుట్ అయి జట్టును కష్టాల్లో నెట్టాడు. దీంతో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒక్కసారి కూడా 50 పరుగుల మైలురాయిని అందుకోలేకపోవడం రోహిత్ కెరీర్‌లో అరుదైన, నిరాశాజనకమైన విషయం.

3 / 5
కివీస్ బౌలర్ల వ్యూహం: న్యూజిలాండ్ బౌలర్లు రోహిత్ శర్మ బలహీనతలపై దెబ్బకొట్టారు. కొత్త బంతితో ఇన్‌స్వింగర్ల ద్వారా అతన్ని ఇబ్బంది పెట్టడంలో వారు విజయం సాధించారు. ముఖ్యంగా జకారి ఫోక్స్, కైల్ జామీసన్ రోహిత్‌ను క్రీజులో సెట్ అవ్వనివ్వకుండా ఒత్తిడి పెంచారు.

4 / 5
కోహ్లీ పోరాటం వృథా: ఒకవైపు రోహిత్, గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి వారు విఫలమైనా, విరాట్ కోహ్లీ మాత్రం తన 54వ వన్డే సెంచరీతో భారత్‌ను గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) కూడా పోరాడినప్పటికీ, టాప్ ఆర్డర్ అందించిన పేలవమైన ఆరంభం భారత్‌ను సిరీస్ ఓటమి వైపు నెట్టేసింది.

5 / 5