శాఖాహారంలో అత్యధిక పోషకాలు ఉండే వాటిల్లో జున్ను ఒకటి. పాలతో తయారుచేసే జున్నులోనో పోషకాలు చేపలు, మాంసంతో సమానంగా ఉంటాయి. అందుకే జున్నును ప్రోటీన్ 'పవర్‌హౌస్'గా పరిగణిస్తారు. అమెరికన్ ఫుడ్ డేటా సెంటర్ ప్రకారం.. 100 గ్రాముల చీజ్‌లో 21.43 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి.