- Telugu News Photo Gallery Rain Alert for Andhra Pradesh and Telangana next 5 days, Latest Weather Updates
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. ఐదు రోజులపాటు భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Rain Alert for Telangana and Andhra Pradesh: వాతావరణ శాఖ మళ్లీ తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడన అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు..
Updated on: Aug 24, 2023 | 1:22 PM

వాతావరణ శాఖ మళ్లీ తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడన అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ మేరు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది.

ఉత్తర-దక్షిణ ద్రోణి, దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి అంతర్గత తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో వ్యాపించి ఉన్నది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ గాలులు వీస్తున్నాయని.. దీంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ సహా.. మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో, గ్రీన్ అలర్ట్‌ను జారీ చేశారు. వీటితోపాటు.. అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది.

కాగా. తెలంగాణ సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవే వర్షాలు మరికొన్ని రోజులు కంటిన్యూ అవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

కాగా.. ఇటీవల కురిసిన వర్షాలు మళ్లీ ముఖం చాటేయడంతో అన్నదాతలు.. వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఖరిఫ్ సీజన్ ప్రారంభమయినప్పటికీ.. చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు వేయలేదు..
