- Telugu News Photo Gallery Pomegranate For Skin: How To Make Pomegranate Face Pack At Home, Check Out Here
Pomegranate For Skin: పెరుగులో దానిమ్మ రసాన్ని కలిపి ఫేస్ ప్యాక్ వేసి చూడండి.. మీ కళ్లను మీరే నమ్మలేరు!
దానిమ్మ శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగ పడుతుంది. ఈ పండు శరీరానికే కాదు చర్మానికీ ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా చర్మ స్థితిస్థాపకతను పునరుద్ధరించే సామర్థ్యం కూడా దీనికి ఉంటుంది. పెరుగులో దానిమ్మ రసాన్ని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని.. దానికి దానిమ్మ రసం జోడించాలి...
Updated on: Feb 29, 2024 | 12:35 PM

అలాగే ఎలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా దానిమ్మ విత్తనాలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి వారు దానిమ్మ తినడం వల్ల అలర్జీ సమస్యలు మరింత పెరుగుతాయి. కానీ అది అందరికీ వర్తించకపోవచ్చు.

పెరుగులో దానిమ్మ రసాన్ని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని.. దానికి దానిమ్మ రసం జోడించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. అంతే కాకుండా దానిమ్మ రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోపలి నుంచి మెరిసేలా చేస్తుంది.

అలాగే ఓట్స్‌లో దానిమ్మ రసాన్ని కలిపి తీసుకుంటే కూడా ఫలితం ఉంటుంది. దీని కోసం ఓట్ పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో దానిమ్మ రసాన్ని కలిపి చర్మానికి పట్టించాలి.

నిమ్మకాయతో కలపడం వల్ల కూడా చర్మానికి పని చేస్తుంది. ఒక గిన్నెలో సమాన పరిమాణంలో దానిమ్మ రసం, నిమ్మరసం కలుపుకోవాలి. ఇది టాన్ సమస్యను దూరం చేస్తుంది.

అంతే కాకుండా కలబంద, దానిమ్మ రసాన్ని కలిపి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సంరక్షణలో కలబందకు ప్రత్యామ్నాయం మరొకటి ఉండదు. ఒక గిన్నెలో కలబంద సారం తీసుకుని, దానికి దానిమ్మ రసం కలపాలి. ఆ ప్యాక్‌ని ముఖానికి బాగా పట్టించాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రమైన నీటితో కడిగేస్తే సరి.




