వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యి వేసుకుని తింటే ఆ రుచికి సాటి మరేదీ ఉండదు. అలాగే వివిధ వంటకాలలో కూడా రుచి నాణ్యాత పెంచడానికి నెయ్యిని జోడించవచ్చు. కానీ ఆహారం రుచిలోనే కాదు నెయ్యి వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయ. ఆయుర్వేద వైద్యంలో నెయ్యిని ఔషధంగా ఉపయోగిస్తారు. నెయ్యి శరీరంలోని కొవ్వు స్థాయిలను తగ్గించడమేకాకుండా, ప్రోటీన్లను పెంచడం, జుట్టు, చర్మానికి మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది.