కర్నాటకలో జరిగిన 26వ జాతీయ యువజనోత్సవాల వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. హుబ్లీకి చేరుకున్న ప్రధాని మోదీ నగరంలోని ప్రధాన వీధిలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ యువజనోత్సవాల ప్రారంభ వేడుకలకు 30వేలకు పైగా యువకులు పాల్గొన్నారు.