- Telugu News Photo Gallery Political photos Kasturi Satya Prasad: Emerging young leader challenging YSRCP and Janasena in Nidadavolu
Kasturi Satya Prasad: ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో స్వతంత్ర అభ్యర్థి సవాల్.. ప్రచారంలో..
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. ఓ స్వతంత్ర అభ్యర్థి తనదైన శైలిలో ప్రచారం చేస్తూ.. ప్రధాన పార్టీలకే సవాల్ విసురుతున్నాడు.. అతనే.. స్వతంత్ర అభ్యర్థి కస్తూరి సత్య ప్రసాద్ (లోకల్ నాని)..
Updated on: Apr 30, 2024 | 9:25 PM

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. ఓ స్వతంత్ర అభ్యర్థి తనదైన శైలిలో ప్రచారం చేస్తూ.. ప్రధాన పార్టీలకే సవాల్ విసురుతున్నాడు.. అతనే.. స్వతంత్ర అభ్యర్థి కస్తూరి సత్య ప్రసాద్ (లోకల్ నాని).. బయటి వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గానికి స్థానిక గొంతుకగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ సవాల్ విసురుతుండటం చర్చనీయాంశంగా మారింది..

వాస్తవానికి నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలదే హావా.. అయితే స్వతంత్ర అభ్యర్థి కస్తూరి సత్య ప్రసాద్ లోకల్ నినాదం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఊరు.. వాడ అనే తేడా లేకుండా అన్ని చోట్లకు తిరుగుతూ.. తనను గెలిపించాలని కోరుతున్నారు. స్థానిక అభ్యర్థిని గెలిపిస్తే.. నిడదవోలు అభివృద్ధి చెందుతుందని వివరిస్తున్నారు. యువకులు, మహిళలు, పెద్దలను కలుస్తూ.. తనను గెలిపించాలని నాని కోరుతున్నారు.

నాని మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలను లేవనెత్తగల స్థానిక వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా నిడదవోలు నుంచి ఎల్లప్పుడూ పారాచూట్ అభ్యర్థులను నిలబెడుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు స్థానికంగా ఎమ్మెల్యేగా గెలుపొందిన అభ్యర్థులెవరూ లేరు.. పైగా స్థానికేతర అభ్యర్థులు ఇక్కడకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తారు. అందుకే.. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తగల స్థానిక అభ్యర్థి అవసరం అని పేర్కొన్నారు.

చరిత్రాత్మక చరిత్ర ఉన్న ఈ నియోజకవర్గానికి మంచి మార్కెట్ ఉందని, స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడంతో కొన్నేళ్లుగా ఆర్థికంగా పతనమైందని నాని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమల అభివృద్ధి కారణంగా గత 30-40 సంవత్సరాలలో రాజమండ్రి, జంగారెడ్డిగూడెం వంటి 25 కిలోమీటర్ల పరిధిలోని అనేక ఇతర పట్టణాలు అభివృద్ది చెందాయని.. నిడదవోలు మాత్రం అలానే ఉందని నాని పేర్కొన్నారు.

కాగా.. ఏపీలో ఎన్నికలు మే 13న జరగనున్నాయి. నిడదవోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు బరిలో ఉండగా.. జనసేనకు చెందిన కందుల దుర్గేష్ ఎన్డీఏ తరపున పోటీచేస్తున్నారు. అయితే, సత్య ప్రసాద్ మాత్రం లోకల్ పేరుతో.. గెలిపిస్తే ఏం చేస్తానో చెబుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
