- Telugu News Photo Gallery Political photos Check India's Most Powerful Politicians list starting from PM Modi to Rahul Gandhi
Most Powerful Politicians: దేశంలో అత్యంత శక్తివంతమైన లీడర్లు వీరే.. ప్రధాని మోదీ తర్వాత ఎవరున్నారంటే..
దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయగా నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నట్లు వార్తా ఛానెల్ ఇండియా టుడే ప్రకటించింది. ప్రధాని మోదీ తర్వాతి స్థానాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, చంద్రబాబు నాయుడు ఉన్నట్లు వెల్లడించింది..
Updated on: Nov 13, 2024 | 1:55 PM

ఈ మేరకు ఇండియా టుడే 2024 పొలిటికల్ పవర్ లిస్ట్.. దేశంల అంత్యంత శక్తివంతమైన నాయకుల పేర్లను పంచుకుంది.. ప్రధాని మోదీ తర్వాతి స్థానాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు.. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని అత్యంత శక్తిమంత నాయకుల్లో ఐదో స్థానంలో నిలిచారు.. ఇంకా ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నారు.. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తిసామర్థ్యాలను అంచనా వేసింది. ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికై.. 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి గెలిచిన తొలి ప్రధానిగా ఆయన రికార్డులకెక్కారు. అంతేకాకుండా, ఒకవైపు అమెరికాతో.. మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహసంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారంటూ విశ్లేషించింది.

రెండో స్థానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ నిలిచారు.. బిజెపి అంతర్గత నిర్మాణంలో సంఘ్ కీలక పాత్ర పోషిస్తుంది.. సంఘ్ సుప్రీంగా.. బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు..

Amit Shah

వరుసగా రెండు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ హోదాను తిరిగి తెచ్చిన నాయకుడిగా రాహుల్‌గాంధీ గుర్తింపు పొందడంతోపాటు.. శక్తివంతమైన నేతల్లో ఐదో వ్యక్తిగా నిలిచారు.

ఐదో స్థానాన్ని దక్కించుకోవడంతోపాటు.. ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తిమంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి, జైలుకెళ్లినా, 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.. ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు.

చంద్రబాబు తర్వాత స్థానాల్లో బిహార్ సీఎం నీతీష్‌కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్ నిలిచారు.




