Vincent Raja car: అన్నాడీఎంకే బహిష్కృత నేత కారును తగలబెట్టిన దుండగులు.. CCTV దృశ్యాలు
అన్నాడీఎంకే తాజా బహిష్కృత నేత విన్సెంట్ రాజా కారుకి ఈ తెల్లవారు జామున గుర్తు తెలియని ఇద్దరు దుండగులు నిప్పు పెట్టారు. పరమకుడిలోని తన ఇంటి ముందు పార్క్ చేసిన కారు..
CCTV Visuals : అన్నాడీఎంకే తాజా బహిష్కృత నేత విన్సెంట్ రాజా కారుకి ఈ తెల్లవారు జామున గుర్తు తెలియని ఇద్దరు దుండగులు నిప్పు పెట్టారు. పరమకుడిలోని తన ఇంటి ముందు పార్క్ చేసిన కారు దగ్గరకి తెల్లవారుజామున చేరుకున్న ఇద్దరు వ్యక్తులు డీజిల్ ట్యాంక్‌ను అగ్గిపెట్టితో అంటించారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసి, కారు మొత్తం కాలిపోయి అస్తిపంజరంలా మిగిలింది. అయితే, ఈ దృశ్యాలు విన్సెంట్ రాజా ఇంటి ముందున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కాగా, విన్సెంట్ రాజాని ఇటీవలే అన్నాడీఎంకే.. పార్టీ నుంచి బహిష్కరించింది. కారణం ఏంటంటే.. ఈనెల మొదటి వారంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ.. అన్నాడీఎంకే నేతతో మాట్లాడిన ఆడియో టేపు లీకైన సంగతి తెలిసిందే.
ఆ టేపులో “తాను మళ్లీ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపడతానని.. పార్టీ భ్రష్టు పట్టిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేనని, తానొచ్చి మళ్లీ పార్టీని గాడిన పెడతాను” అంటూ తన మద్దుతుదారులకు శశికళ భరోసా ఇచ్చారు.
ఈ ఆడియో తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనమయ్యింది. ఆ టేపులో శశికళతో మాట్లాడింది విన్సెంట్ రాజా అని తేలడంతో పార్టీ నుంచి అతన్ని బహిష్కరించారు.
అతని కారుని ఇప్పుడు ఎవరో దుండగులు అగ్నికి ఆహుతిచేశారు. ఈ ఘటనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
The car of Vincent Raja, a former #AIADMK functionary in #Paramakudi was set ablaze by 2 unidentified men in the wee hours today while it was parked in his property. He escaped unhurt.
2 weeks ago, he was expelled from #ADMK for his telephonic conversation with VK Sasikala. pic.twitter.com/6j8KgA5hqG
— ??????? ??????? (@Lalitha_Ranjani) June 21, 2021