విశాఖపట్నం అనగానే సముద్రం గుర్తొస్తుంది ఎవరికైనా. అయితే, వైజాగ్ లో సముద్రాన్ని మించిన అందాలు చాలా ఉన్నాయి. కొన్ని ఆ సముద్రం చుట్టూ ఉన్న అద్భుతాలు అయితే, మరికొన్ని విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నవి. ఇక్కడ ప్రకృతి రమణీయతతో పాటూ ఆధ్యాత్మిక వీచికలనూ మనం ఆస్వాదించవచ్చు. వైజాగ్ దగ్గరలో చూడవలసిన ప్రదేశాలలో కొన్ని ఇవే!