- Telugu News Photo Gallery Pineapple Benefits: Why You Should Eat Pineapple During Hot Summer Months, Know reasons
Pineapple Benefits: ఈ పండు తింటే ఇక మందులు వేసుకోవల్సిన అవసరం లేదు.. ఎన్నో రోగాలు పరార్!
ఆరోగ్య సంరక్షణకు ఎంతో మంది కేవలం మందులపై ఆధారపడి జీవితాన్ని గడుపుతుంటారు. సమతుల్య ఆహారం, వ్యాయామం వంటి జీవనశైలిలో కొన్ని మార్పుల వల్ల ఇలా మందులు వాడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ కాలంలో దొరికే పైనాపిల్ మంచి ఆరోగ్యానికి ఎంతో దోహద పడుతుంది..
Updated on: Jun 06, 2024 | 8:01 PM

ఆరోగ్య సంరక్షణకు ఎంతో మంది కేవలం మందులపై ఆధారపడి జీవితాన్ని గడుపుతుంటారు. సమతుల్య ఆహారం, వ్యాయామం వంటి జీవనశైలిలో కొన్ని మార్పుల వల్ల ఇలా మందులు వాడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ కాలంలో దొరికే పైనాపిల్ మంచి ఆరోగ్యానికి ఎంతో దోహద పడుతుంది.

అనేక వ్యాధుల నుండి పైనాపిల్ కాపాడుతుంది. పైనాపిల్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. వేసవిలో డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి పైనాపిల్ ఉపయోగపడుతుంది. పైనాపిల్స్‌లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఈ పోషకం శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇన్ఫెక్షన్, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

వేసవిలో పొట్టకు సంబంధించిన సమస్యలు అధికంగా తలెత్తుతాయి. అతిసారం, కడుపు నొప్పి, అజీర్ణం వంటి అనేక సమస్యల నుంచి బయటపడేందుకు పైనాపిల్ సహాయపడుతుంది. ఈ పండులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపులో అసౌకర్యాన్ని దూరం చేస్తాయి.

అధిక వేడి, తేమ, వేడి ఏ సమయంలోనైనా రక్తపోటును పెంచుతాయి. వేసవిలో రక్తపోటును నియంత్రించడంలో పైనాపిల్ సహాయపడుతుంది. ఈ పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. ధమనులకు ఏర్పడే అడ్డంకులు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

శరీరంలో మంట తగ్గాలంటే పైనాపిల్ తినాలి. పైనాపిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది ఎలాంటి నొప్పి, వాపునైనా తగ్గించడంలో సహాయపడుతుంది. ఎండాకాలంలో బరువు తగ్గాలంటే ఖచ్చితంగా పైనాపిల్ తినాలి. ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని అరికట్టడానికి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది ఎనర్జీ లెవల్స్‌ను కూడా పెంచుతుంది. పైనాపిల్‌లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. ఈ పండు చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది.



















