Smart phone: ఫోన్‌ వేడేక్కుతోందా.? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..

స్మార్ట్‌ ఫోన్‌ వేడెక్కడం సర్వసాధారణమైన విషయం. ఫోన్‌ ఉపయోగిస్తున్న ప్రతీ ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే స్మార్ట్‌ ఫోన్‌ వేడెక్కితే పనితీరుపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి మీ ఫోన్‌ను కాపాడుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jun 06, 2024 | 8:19 PM

స్మార్ట్‌ ఫోన్‌ వేడెక్కకూడదంటే ఎక్కువగా సన్‌లైట్‌కు ఫోన్‌ ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇటీవల చాలా మంది బైక్‌కు ముందు ఫోన్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ఫోన్‌ బ్యాటరీ త్వరగా వేడెక్కుతోంది, ఇది ఫోన్‌ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

1 / 5
ఇక గేమింగ్‌, జీపీఎస్ నావిగేషన్‌, వీడియో స్ట్రీమింగ్ వంటి వాటివల్ల కూడా ఫోన్‌ త్వరగా వేడెక్కే అవకాశం ఉంటుంది. అలాగే ఫోన్‌లో ఒకేసారి ఎక్కువ టాస్క్‌లు చేస్తే కూడా ఫోన్‌ వేడెక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోన్‌ ఉపయోగించే విధానంలో కూడా కీలక పాత్ర పోషించాలని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
ప్రస్తుతం దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్‌లలో బ్యాటరీ సేవింగ్ మోడ్‌ అందుబాటులో ఉంటోంది. ఈ ఫీచర్‌ను ఆన్‌ చేసుకోవడం ద్వారా బ్యాగ్రౌండ్‌ ప్రాసెస్‌లో జరిగే ఆపరేషన్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. దీంతో ఫోన్‌ వేడెక్కడం తగ్గుతుంది.

3 / 5
స్మార్ట్‌ ఫోన్‌ వేడెక్కకుండా ఉండడం కోసం స్మార్ట్‌ ఫోన్‌ కేస్‌ను అప్పుడప్పుడు తొలగిస్తుండాలి. ఫోన్‌ ప్రొటెక్షన్ కోసం ఉపయోగించే కేస్‌ వల్ల బ్యాటరీ నుంచి వచ్చే వేడి బయటకు పోకుండా ఫోన్‌ కూడా వేడిగా మారే అవకాశం ఉంటుంది.

4 / 5
ఇక అవసరం లేని సమయంలో కూడా బ్లూటూత్‌, వైఫై, జీపీఎస్‌ వంటి ఫీచర్లను ఆన్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ త్వరగా డ్రై అవ్వడమే కాకుండా ఫోన్‌ వేడెక్కడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అవసరం లేని సమయంలో ఇలాంటి ఫీచర్లను ఆన్‌ చేయకుండా ఉండడం బెటర్‌.

5 / 5
Follow us