Period Cramps: ఆ సమయంలో కడుపునొప్పి రాకూడదంటే.. ఈ ఆలవాట్లు మానుకోండి

పీరియడ్స్‌ వచ్చే రోజుల్లో కొంత మంది అమ్మాయిల్లో శారీరక అసౌకర్యం మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు తీవ్రమైన కడుపు నొప్పి, విపరీతమైన రక్తస్రావం, శారీరక బలహీనత వేదిస్తుంది. అందుకే పీరియడ్స్‌ సమయంలో అహారంపై ఆధిక శ్రద్ధ తెలుసుకోవాలి. పోషకాహారం తీసుకుంటే శారీరక అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. చిప్స్, ఉప్పు, తీపి ఆహారం..

Srilakshmi C

|

Updated on: Sep 15, 2024 | 1:30 PM

పీరియడ్స్‌ వచ్చే రోజుల్లో కొంత మంది అమ్మాయిల్లో శారీరక అసౌకర్యం మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు తీవ్రమైన కడుపు నొప్పి, విపరీతమైన రక్తస్రావం, శారీరక బలహీనత వేదిస్తుంది. అందుకే పీరియడ్స్‌ సమయంలో అహారంపై ఆధిక శ్రద్ధ తెలుసుకోవాలి. పోషకాహారం తీసుకుంటే శారీరక అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. చిప్స్, ఉప్పు, తీపి ఆహారం మానుకోవాలి. వీటిని తినడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. దీంతో శరీరం బరువుగా అనిపిస్తుంది.

1 / 5
పీరియడ్స్‌ కారణంగా వ్యాయామం ఆపాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో తేలికపాటి వ్యాయామం చేస్తే రుతుక్రమానికి సంబంధించిన శారీరక బాధలు దూరమవుతాయి. పీరియడ్స్‌ వచ్చే రోజుల్లో ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు. రక్తం శరీరం నుండి వెళ్లిపోతుంది. కాబట్టి శరీరం బలహీనంగా మారుతుంది. ఈ సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలి. అయితే చక్కెర ఆహారాలకు దూరంగా ఉండాలి.

2 / 5
పీరియడ్స్‌ సమయంలో శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. మానసిక స్థితి చికాకుగా మారుతుంది. ఈ సమయంలో రాత్రి ఎక్కువ సేపు మేల్కొనడం మానుకోవాలి. నిద్రలేమి సమస్యలు శారీరక అసౌకర్యాన్ని పెంచుతాయి.

3 / 5
పీరియడ్స్‌ సమయంలో టీ, కాఫీ లేదా కెఫిన్ కలిగిన పానీయాలను నివారించాలి. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీని వల్ల కూడా పీరియడ్స్‌ సమయంలో తలనొప్పి వస్తుంది. పీరియడ్స్‌ సమయంలో గ్యాస్ బర్న్‌కు కారణమయ్యే పాలు లేదా పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోకూడదు. పాల ఉత్పత్తులు గ్యాస్, గుండెల్లో మంట సమస్యను పెంచుతాయి. మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయి.

4 / 5
 పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడేవారు, ఈ సమస్యను నివారించడానికి ధూమపానం, మద్యం సేవించడం మానుకోవాలి. ఫలితంగా పీరియడ్స్‌ సమయంలో అనేక శారీరక సమస్యలను నివారించవచ్చు.

5 / 5
Follow us