AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hemoglobin: సోషల్ మీడియా చూసి ఈ తప్పులు చేస్తే.. మీ ఒంట్లో హిమోగ్లోబిన్ హుష్‌!

శరీరంలో హిమోగ్లోబిన్ సరైన స్థాయిలో లేకుంటే రకహీనతతోపాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం చాలా మంది తక్కువ హిమోగ్లోబిన్ సమస్యతో బాధడుతున్నారు. అందుకు కారణం సరైన పోషకాహారం తీసుకోకపోవడమే. వైద్యులు హిమోగ్లోబిన్ పెంచడానికి మందులు ఇస్తుంటారు. అయితే ఈ సమయంలో..

Srilakshmi C
|

Updated on: Jan 28, 2026 | 1:04 PM

Share
ఒంట్లో సరిపడా హిమోగ్లోబిన్ లేకుంటే రక్త హీనత తలెత్తుతుంది. హిమోగ్లోబిన్ (Hb) అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ఐరన్ తో కూడిన ప్రోటీన్. ఇది ఆక్సిజన్‌ను రక్తం ద్వారా అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. మళ్లీ ఆయా భాగాల నుంచి కార్భన్‌డైయాక్సైడ్‌ను ఊపిరితిత్తులకు చేరుస్తుంది.

1 / 5
శరీరంలో హిమోగ్లోబిన్ సరైన స్థాయిలో లేకుంటే రకహీనతతోపాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం చాలా మంది తక్కువ హిమోగ్లోబిన్ సమస్యతో బాధడుతున్నారు. అందుకు కారణం సరైన పోషకాహారం తీసుకోకపోవడమే. వైద్యులు హిమోగ్లోబిన్ పెంచడానికి మందులు ఇస్తుంటారు. అయితే ఈ సమయంలో, మనం చేసే కొన్ని తప్పులు సమస్యను తీవ్రతరం చేస్తుంది.

2 / 5
కొందరు వైద్యులను సంప్రదించకముందే సోషల్ మీడియాలో వీడియోలు చూసి సొంత వైద్యం చేస్తుంటారు. ఆహారంలో మార్పులు చేస్తుంటారు. ఈ మార్పులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత కాకుండా వీడియోలు చూసిన తర్వాత చేయడం చాలా ప్రమాదకరం. కేవలం సోషల్ మీడియాలో వీడియోలు చూసి ఆహారాన్ని మార్చుకోవడం అంత మంచిది కాదు.

3 / 5
ఇది ఆరోగ్యంపై చెడు, ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మీరూ ఇలాంటి తప్పు చేస్తుంటే ఈరోజే జాగ్రత్తగా ఉండండి. వంట చేసేటప్పుడు ఆరోగ్యానికి మంచిది కదాని పసుపు కాస్త ఎక్కువగా వేస్తుంటారు. నిజానికి ఇది శరీరంలో ఇనుము శోషణను తగ్గిస్తుంది. రక్తహీనత లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు ఇప్పటికే తక్కువగా ఉన్నవారు ప్రతిరోజూ పసుపు పాలు తాగడం హానికరం.

4 / 5
పసుపు పాలు ఆరోగ్యానికి ఖచ్చితంగా మేలు చేస్తాయి. కానీ ఇది అందరికీ మేలు చేస్తుందని చెప్పడం కష్టం. కాబట్టి హిమోగ్లోబిన్ సంబంధిత సమస్యలు ఉన్నవారు పసుపు పాలు తాగడం నివారించాలి. అవగాహన లేకుండా పసుపు పాలు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా నేరుగా ప్రభావితం చేస్తుంది.

5 / 5