AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apara Ekadashi: అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్, మీ రాశి ఇదేనా..?

Parijat Raj Yog: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన యోగాల్లో పారిజాత యోగం ఒకటి. ఈ ఏడాది మే 13న వచ్చే అపర ఏకాదశి సందర్భంగా ఈ అరుదైన యోగం ఏర్పడుతోంది. ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ రోజున ఉపవాసం, విష్ణు సహస్రనామ పారాయణం, ప్రత్యేక పూజలు చేస్తే విష్ణు కటాక్షం లభిస్తుందని విశ్వాసం.

Rajashekher G
|

Updated on: May 10, 2026 | 3:20 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ప్రత్యేక యోగాలు వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని విశ్వసిస్తారు. గజకేసరి రాజయోగం, త్రిగ్రహ రాజయోగం, లక్ష్మీనారాయణ యోగంతో పాటు పారిజాత యోగం కూడా అత్యంత శుభప్రదమైన యోగాల్లో ఒకటిగా భావించబడుతుంది.
ఈ ఏడాది మే 13న వచ్చే అపర ఏకాదశి సందర్భంగా అరుదైన పారిజాత యోగం ఏర్పడనుంది.

జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ప్రత్యేక యోగాలు వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని విశ్వసిస్తారు. గజకేసరి రాజయోగం, త్రిగ్రహ రాజయోగం, లక్ష్మీనారాయణ యోగంతో పాటు పారిజాత యోగం కూడా అత్యంత శుభప్రదమైన యోగాల్లో ఒకటిగా భావించబడుతుంది. ఈ ఏడాది మే 13న వచ్చే అపర ఏకాదశి సందర్భంగా అరుదైన పారిజాత యోగం ఏర్పడనుంది.

1 / 5
ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు, ప్రత్యేక పూజలు చేస్తే మహావిష్ణువు కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఈసారి ఏర్పడుతున్న పారిజాత యోగం ప్రభావం ద్వాదశ రాశులపై ఉండనున్నప్పటికీ, కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ అదృష్ట రాశులు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5

తులా రాశి.. 
పారిజాత యోగం ప్రభావంతో తులా రాశివారికి ఆర్థికంగా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూల సమయం. కోర్టు వ్యవహారాల్లో విజయ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. వివాహ యత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ, గౌరవం మరింత పెరుగుతుంది.

తులా రాశి.. పారిజాత యోగం ప్రభావంతో తులా రాశివారికి ఆర్థికంగా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూల సమయం. కోర్టు వ్యవహారాల్లో విజయ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. వివాహ యత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ, గౌరవం మరింత పెరుగుతుంది.

3 / 5

మిథున రాశి.. 
మిథున రాశివారికి ఈ యోగం వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతిని తీసుకురానుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు కనిపిస్తున్నాయి. సోదరులతో ఉన్న విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది. మీరు ఆశించిన దానికంటే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మీ మాటతీరు, నిర్ణయ సామర్థ్యం చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటాయి.

మిథున రాశి.. మిథున రాశివారికి ఈ యోగం వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతిని తీసుకురానుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు కనిపిస్తున్నాయి. సోదరులతో ఉన్న విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది. మీరు ఆశించిన దానికంటే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మీ మాటతీరు, నిర్ణయ సామర్థ్యం చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటాయి.

4 / 5
ధనుస్సు రాశి.. 
ధనుస్సు రాశివారికి పారిజాత యోగం శుభ ఫలితాలను అందించనుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రభావం పెరిగే సమయం ఇది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశివారికి పారిజాత యోగం శుభ ఫలితాలను అందించనుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రభావం పెరిగే సమయం ఇది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us
అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్,.
అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్,.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన లైవ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన లైవ్..
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...