లక్ష్మీదేవికి ఇష్టమైన 6 మొక్కలు ఇవే.. ఇంట్లో ఇలా పెంచితే కనక వర్షమే..!

10 May 2026

Rajashekher

వాస్తు శాస్త్రం, హిందూ మత విశ్వాసాల ప్రకారం, కొన్ని మొక్కలను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. ఈ మొక్కలు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి. వాటిని ఇంట్లో సరిగ్గా ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

అపరాజిత.. నీలిరంగు పూలు పూసే అపరాజిత తీగ విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది. విష్ణుమూర్తి ఈ నీలిరంగు తీగను ఇష్టపడతారు కాబట్టి, ఇది లక్ష్మీదేవిని కూడా ఆకర్షిస్తుంది.

అపరాజిత మొక్కను నాటిన ఇల్లు లక్ష్మీదేవి నివాసంగా పరిగణించబడుతుంది. శుభ ఫలితాలు పొందడానికి దీనిని ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి.

తులసి.. హిందూమతంలో తులసిని చాలా పవిత్రమైనదిగా, పూజనీయమైనదిగా భావిస్తారు. తులసి మొక్క నాటిన ఇంట్లో ప్రతికూలత ఎప్పుడూ ఉండదు. 

తులసిని ప్రతిరోజూ పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటి ఖజానా ఎల్లప్పుడూ సంపదతో నిండి ఉంటుంది. తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో దిశలో నాటాలి.

మనీ ప్లాంట్.. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచితే ఆర్థిక లాభాలు, సంపద ఆకర్షణ కలుగుతాయని నమ్మకం ఉంది. వాస్తు ప్రకారం ఇది పైకి పెరిగితే ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది. ఆగ్నేయ మూలలో ఉంచడం శుభప్రదం. 

షమీ మొక్క.. నమ్మకం ప్రకారం, శమీ మొక్క శని దేవుడు, శివుడికి ప్రీతికరం. దీనిని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, బయటకు వెళ్లేటప్పుడు కుడి వైపున నాటితే వ్యాపార ఆటంకాలు తొలగి లాభాలు పెరుగుతాయని విశ్వాసం ఉంది.

జేడ్ మొక్క.. మీ ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున ఒక జేడ్ మొక్కను ఉంచాలి. ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది. ఆఫీసు డెస్క్ మీద కూడా జేడ్ మొక్కను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. దానిని డెస్క్‌కు ఉత్తరం వైపున ఉంచాలి.

వెదురు మొక్క.. వాస్తు శాస్త్రం ప్రకారం, వెదురు మొక్క అదృష్టాన్ని తెస్తుందని భావిస్తారు. దానిని ఇంటికి తూర్పు లేదా ఈశాన్య మూలలో ఉంచాలి. ఇంట్లో వెదురు మొక్కను ఉంచడం వల్ల సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి.