AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oversleeping Bad Effects: నిద్ర లేవడానికి బద్ధకిస్తూ కొంచెం సేపు అంటూ 10 గంటలు నిద్రపోతున్నారా.. దుష్ప్రభావాలు తెలుసా..

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు.. అవును అతి ఎప్పుడూ అనర్ధమే.. అతి తినే విషయంలోనైనా.. రిలేషన్స్ విషయంలోనైనా ఆరోగ్యం విషయంలోనైనా .. అతిగా చేసే పనులు అనార్ధనలను, అనారోగ్యాన్ని తీసుకుని వస్తాయి. అలాంటి అనారోగ్యానికి కారణం ఒకటి అతిగా నిద్రపోవడం కూడా.. నిద్ర లేమి వలన ఎంత ఇబ్బందులు పడతారో.. అదే విధంగా అతిగా నిద్రపోవడం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. రోజూ 8 గంటల నిద్ర ఆరోగ్యకరం అన్న సంగతి తెలిసిందే.. అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే ఎ విధంగా శరీరక ఇబ్బందులు కలుగుతాయో.. అదే విధంగా రోజులో 10 గంటలకంటే ఎక్కువ నిద్రపోయినా కూడా ఆరోగ్యానికి ప్రమాదకమేనట..

Surya Kala
|

Updated on: Mar 02, 2024 | 8:02 AM

Share
ఒక వ్యక్తి క్రమం తప్పకుండా 10 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే.. ఆ నిద్రతో తనకి తనకే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లు అంటూ పరిశోధనలు చెబుతున్నాయి. ఎక్కువ సేపు నిద్రపోయే వ్యక్తి ఊబకాయంతో బాధపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి వారు ఓవర్ స్లీపింగ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని చెబుతున్నారు.

1 / 8
దాదాపు ప్రతిరోజూ 9 లేదా 10 గంటల కంటే ఎక్కువ నిద్రపోతున్నా సరే.. నిద్ర అంటే విసుగు చెందడానికి ఇష్టపడరు. సరి కదా మరికొంచెం సేపు నిద్రపోవాలని కోరుకుంటారు కొందరు. అయితే ఇలాంటి వారు ఈరోజు నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఓవర్ స్లీపింగ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు.

2 / 8
తక్కువ నిద్ర డిప్రెషన్ కు దారితీసినట్లే, ఎక్కువ నిద్ర కూడా డిప్రెషన్ కు దారి తీస్తుంది. డిప్రెషన్‌తో బాధపడేవారిలో 15 శాతం మంది అతిగా నిద్రపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా వారి మానసిక ఆరోగ్యం మరింత క్షీణించవచ్చు.

3 / 8
చాలా తక్కువ లేదా ఎక్కువ నిద్ర హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. శరీర సాధారణ లయ చెదిరిపోతుంది, ఇది వంధ్యత్వానికి కారణమవుతుంది. అందువల్ల, ఒక నిర్దిష్ట సమయాన్ని అనుసరించడానికి ప్రయత్నించండి. అదే విధంగా వీలైనంతవరకూ సూర్యోదయ సమయంలో లేదా ఉదయం లేవండి.

4 / 8
రోజులో ఎక్కువ సమయం నిద్రపోవడం కూడా మరణానికి కారణమవుతుంది. రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోయే వ్యక్తి కంటే రోజుకు 9 గంటల కంటే ఎక్కువ నిద్రించే వ్యక్తి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి.

5 / 8
ఇలా జరగడానికి ఖచ్చితమైన కారణం ఇంకా పరిశోధనలో ఉంది. అయినప్పటికీ ఎక్కువ నిద్ర మానసిక అలసటకు దారితీస్తుందని నమ్ముతారు. ఇది వ్యక్తిని శారీరకంగా కూడా బలహీనపరుస్తుంది. వీటన్నిటి కారణంగా అతను మరణం వైపు పయనిస్తూనే ఉంటాడు.

6 / 8
అత్యంత సాధారణ నిద్ర సంబంధిత శ్వాస రుగ్మత అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వల్ల కూడా ఓవర్ స్లీపింగ్ రావచ్చు. ఈ వ్యాధిలో వ్యక్తి నిద్రలో తాత్కాలికంగా ఊపిరిపోతున్న  అనుభూతిని కలిగి ఉండవచ్చు. ఫలితంగా సాధారణ నిద్ర చక్రం చెదిరిపోతుంది.

7 / 8
కొన్నిసార్లు కొన్ని మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల వల్ల కూడా సుదీర్ఘంగా నిద్ర పోవాలని కోరుకుంటారు . వైద్య శాస్త్రం ప్రకారం హైపర్సోమ్నియా మీలో ఈ సిండ్రోమ్‌కు కారణం కావచ్చు.

8 / 8