- Telugu News Photo Gallery Business photos EV scooters compete with petro scooters, EV scooters that are making dust in the market, Best EV Scooters details in teugu
Best EV Scooters: పెట్రో స్కూటర్ల ధీటుగా ఈవీ స్కూటర్లు.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న ఈవీ స్కూటర్‌లు ఇవే..!
భారతదేశంలో ఈవీ స్కూటర్ల వినియోగం పెరుగుతుంది. పెట్రోల్ స్కూటర్లతో పోటీగా ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో దుమ్ము రేపుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెరుగుతున్న ఇంధన ధరలు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వంటి అనేక కారణాల వల్ల భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మీ మంచి ఈవీ స్కూటర్ కొనాలని ఆలోచిస్తుంటే ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్ ఈవీ స్కూటర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Mar 02, 2024 | 6:30 AM

ఓలా ఎస్ 1 ప్రో 2వ జెనరేషన్ ఏఆర్ఏఐ ధ్రువీకరించిన 195 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్‌లో 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే 8 సంవత్సరాల గ్యారెంటీతో వస్తుంది. 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వచ్చే ఈ స్కూటర్ ప్రస్తుతం రూ. 1.30 లక్షల ప్రారంభ ధరతో ఉంది.

సింపుల్ ఎనర్జీస్ వన్ భారతదేశంలోని ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంచి ఫీచర్లతో వచ్చే స్కూటర్స్‌లో మొదటి స్థానంలో ఉంటుంది. ఏఆర్ఏఐ ధ్రువీకరించిన ఈ స్కూటర్ 212 కిమీ పరిధిని కలిగి ఉంది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.40 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్కూటర్ 4.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే గంట 105 కిమి వరకు వేగాన్ని అందుకుంటుంది.

హీరో మోటోకార్ప్ కంపెనీకు చెందిన విడా వీ1 నప్రో ఒక్కసారి చార్జి చేస్తే 165 కిలో మీటర్ల ఐడీసీ పరిధితో వస్తుంది. 3.94 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో పని చేసే ఈ స్కూటర్ ధర రూ. 98,000గా ఉంది. ఈ స్కూటర్ గంటకు 80 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లుతుంది

ఫాస్ట్ ఎఫ్ 4 పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీపై 160 కి.మీ పరిధిని క్లెయిమ్ చేస్తుంది. 4.4 కేడబ్ల్యూహెచ్ (2x2.2 కేడబ్ల్యూహెచ్) డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్ అమర్చి వస్తంది. ఈ స్కూటర్ మూడు రైడ్ మోడ్లను అందిస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్, గరిష్ట వేగం 70 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ ఈవీ ధర రూ. 1.20 లక్షలుగా ఉంది.

ఒకినావా ఓకి-90 ఏఆర్ఏఐ ధ్రువీకరించిన 160 కిమీ పరిధితో వస్తుంది. 3.08 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 74 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. అయితే ఈ మోడల్ దాని పోటీదారుల కంటే ఎక్కువ ధరను కలిగి ఉంది. ఈ స్కూటర్ ధర రూ. 1.86 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.




