- Telugu News Photo Gallery Oranges Post Meal: Eating Oranges And Other Citrus Fruits After A Meal May Not Be Healthy, Know Why
Oranges-Post Meal: మధ్యాహ్న భోజనం తర్వాత ఆరెంజ్ పండ్లు తింటున్నారా? మీ ఆరోగ్యం డేంజర్‌లో పడ్లట్లే..
శీతాకాలంలో ఆరెంజ్ పండ్లు అధికంగా లభిస్తాయి. శీతాకాలంలో వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మధ్యాహ్న సమయంలో ఈ పండ్లను తినడం ఆరోగ్యినిక అంతమంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను అస్సలు తినకూడదట. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.. నిమ్మకాయల నుంచి నారింజ వరకు అన్నీ ఒకే జాతికి చెందిన పండ్లు. వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది..
Updated on: Jan 30, 2024 | 11:41 AM

శీతాకాలంలో ఆరెంజ్ పండ్లు అధికంగా లభిస్తాయి. శీతాకాలంలో వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మధ్యాహ్న సమయంలో ఈ పండ్లను తినడం ఆరోగ్యినిక అంతమంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను అస్సలు తినకూడదట. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..

నిమ్మకాయల నుంచి నారింజ వరకు అన్నీ ఒకే జాతికి చెందిన పండ్లు. వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి, ఐరన్ శోషణ, కొల్లాజెన్ ఏర్పడటానికి సిట్రస్ పండ్లు సహాయపడుతుంది. కానీ అన్నం తిన్న తర్వాత ఈ పండ్లు తినకూడదు.

పుల్లటి పండ్ల వల్ల కలిగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సిట్రస్ పండ్లు తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మ సమస్యలు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. కానీ మధ్యాహ్న భోజనం తర్వాత సిట్రస్ పండ్లను తినడం వల్ల ఈ ప్రయోజనాలేవీ లభించవు.సిట్రస్ పండ్లలో ఆమ్ల పదార్థాలు ఉంటాయి. కాబట్టి మధ్యాహ్న భోజనం తర్వాత ఈ రకమైన పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. నారింజలో ఉండే యాసిడ్ అజీర్ణం, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది.

మధ్యాహ్న సమయంలో తినే ఆహారంలో చాలా పోషకాలు ఉంటాయి. మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే నారింజ తింటే ఆ పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది. నిమ్మకాయలు కూడా బహుళ పోషకాలను కలిగి ఉంటాయి. అన్నం తిన్న తర్వాత ఇలాంటి పండ్లను తింటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నారింజ పండ్లు సహజ చక్కెరలను కలిగి ఉంటాయి. కాబట్టి లంచ్ తర్వాత ఈ రకమైన పండ్లను తినడం వల్ల షుగర్ లెవెల్ అకస్మాత్తుగా పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది. ఇది శారీరక అసౌకర్యం, అలసటను పెంచుతుంది. కాబట్టి మధ్యాహ్న భోజనం తర్వాత నారింజ తినడం ప్రమాదం.

అంతేకాకుండా మధ్యాహ్న భోజనం తర్వాత నారింజ తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు. అయితే ఉదయం అల్పాహారం - మధ్యహ్నం భోజనం మధ్య సమయంలో నారింజలను స్నాక్స్‌గా తినవచ్చు. ఇలా తినడం వల్ల శరీరంపై ఎటువంటి హానికరమైన ప్రభావాన్ని చూపదు. బదులుగా, అన్ని ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.




