- Telugu News Photo Gallery No more tension like period stains on the bed sheet, it can be cleaned simply, Check here is details
Periods Stains: బెడ్‌షీట్‌పై పీరియడ్స్ మరకలా.. నో టెన్షన్! సింపుల్‌గా క్లీన్ చేయొచ్చు..
పీరియడ్స్ సమయంలో సాధారణంగా అప్పుడప్పుడు బెడ్ షీట్‌పై మరకలు పడటం అనేది కామన్ విషయం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి బ్లడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా రాత్రి పూట పడుకునే సమయాల్లో ఈ సమస్యను చూసే ఉంటారు. మరుసటి రోజు చిన్న మరకైనా బెడ్ షీట్‌పై చిరాకుగా కనిపిస్తుంది. దీంతో చాలా మంది బెడ్ షీట్ అనేది ఉతుకుతూ ఉంటారు. అయితే ఇకపై అలాంటి అవసరం లేదు. చిన్న మరకైనా.. పెద్ద మరకైనా..
Updated on: Apr 20, 2024 | 3:54 PM

పీరియడ్స్ సమయంలో సాధారణంగా అప్పుడప్పుడు బెడ్ షీట్‌పై మరకలు పడటం అనేది కామన్ విషయం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి బ్లడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా రాత్రి పూట పడుకునే సమయాల్లో ఈ సమస్యను చూసే ఉంటారు.

మరుసటి రోజు చిన్న మరకైనా బెడ్ షీట్‌పై చిరాకుగా కనిపిస్తుంది. దీంతో చాలా మంది బెడ్ షీట్ అనేది ఉతుకుతూ ఉంటారు. అయితే ఇకపై అలాంటి అవసరం లేదు. చిన్న మరకైనా.. పెద్ద మరకైనా ఈజీగా తొలగించవచ్చు.

ముందుగా బెడ్ షీట్‌పై మరకపై వాటర్ వేయండి. ఆ తర్వాత టిష్యూ పేపర్ తీసుకుని.. మరకపై ఉంచి.. ఒత్తండి. ఇలా చేస్తే టిష్యూ పేపర్‌కు వచ్చేస్తుంది. దీంతో బెడ్ షీట్‌పై మరక అనేదే ఉండదు. ఆ తర్వాత కొద్దిగా డెటాల్ తో శుభ్రం చేసుకుంటే సరి.

అదే విధంగా ఈ టెన్నిక్ కూడా బాగా ఉపయోగ పడుతుంది. ఉప్పు తీసుకుని.. మరక పడ్డ ప్రదేశంలో వేసి ఓ పది నిమిషాలు అలానే ఉంచండి. నెక్ట్ బ్రెష్‌తో నెమ్మదిగా రుద్దండి. ఆ తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ తీసుకుని.. ఆ ప్రాంతాన్ని తుడవాలి. అంతే సులభంగా మరకను తొలగిపోతుంది.

పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. విపరీతమైన కడుపునొప్పి, మానసిక కల్లోలంతోపాటు ముఖం మొటిమలు, దద్దుర్లు చిరాకు తెప్పిస్తాయి.




