AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cockroach Control: బొద్దింకలపై బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో క్షణాల్లో తరిమికొట్టండి

బొద్దింకలు ప్రతి ఒక్కరి వంటగదిలో ఒక సాధారణ సమస్య. వీటి బెడద నుంచి బయటపడటానికి చాలా మంది మార్కెట్లో లభించే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ అవి కొన్నిసారికి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కొన్ని స్ప్రేలు దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉండవు. మీ వంటగదిలోని ఈ అవాంఛిత కీటకాల సమస్యను తొలగించుకోవాలనుకుంటే, మీరు ఇంట్లో దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించుకోవచ్చు. అవేంటి వాటిని ఉపయోగించి బొద్దింకలను ఎలా తరిమికొట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Sep 29, 2025 | 8:24 PM

Share
నిమ్మరసం: బొద్దింకలు పుల్లని రుచి, వాసనను ఇష్టపడవు. అవి తిరిగే ప్రదేశంలో నిమ్మరసం ఉంచితే ఆ ప్రాంతాల్లోకి అవి రాకుండా ఉంటాయి. రాత్రి వంటగదిని శుభ్రం చేసిన తర్వాత, నిమ్మరసాన్ని ఒక బకెట్ నీటిలో కలిపి నేలను బాగా తుడవండి. ఇది బొద్దింకలను దూరంగా ఉంచుతుంది. అలాగే వంటగదికి తాజా వాసనను ఇస్తుంది.

1 / 5
బేకింగ్ సోడా, చక్కెర: బేకింగ్ సోడా, చక్కెర కలిపిన ద్రావణం బొద్దింకలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే, ఈ ద్రావణం కొన్నిసార్లు చీమలను ఆకర్షిస్తుంది. బేకింగ్ సోడా, చక్కెరను సమాన భాగాలుగా కలిపి, బొద్దింకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో, సింక్ చుట్టూ, రిఫ్రిజిరేటర్ వెనుక లేదా క్యాబినెట్ల కింద చల్లుకోండి. ఇలా చేయడం ద్వారా బొద్దింకలు ఆ పరిసరాల్లోకి రాకుండా ఉంటాయి.

2 / 5
బే ఆకులు: ఈ ఆకులను ఎక్కువగా సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు, కానీ బొద్దింకలు వాటి వాసనను ఇష్టపడవు. వంటగది నుండి బొద్దింకలను తరిమికొట్టడానికి, బే ఆకులను మెత్తగా చేసి వంటగది మూలల్లో చల్లుకోండి. వాటి బలమైన వాసన బొద్దింకలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది.

3 / 5
దోసకాయ తొక్కలు: చాలా మంది దోసకాయ తొక్కలను పారేస్తారు, కానీ అవి బొద్దింకలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. బొద్దింకలు ఎక్కువగా ఉండే వంటగది ప్రాంతాలలో తాజా దోసకాయ తొక్కలను ఉంచండి. ఉదయానికి మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు.

4 / 5
 శుభ్రపరచడం: ఈ సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా, మీరు బొద్దింకల సమస్య నుండి బయటపడవచ్చు. దీనితో పాటు, మీరు మీ వంటగదిని శుభ్రంగా, సువాసనగా ఉంచుకోవచ్చు. బొద్దింకలను మీ వంటగది నుండి దూరంగా ఉంచడానికి ఈ చిట్కాలతో పాటు, మీరు వంటగది శుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే బొద్దింకలు ఎక్కువ మురికి, తడిగా ఉన్న ప్రదేశాలలో ఉంటాయి. కాబట్టి వంటగదిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం మంచింది.

5 / 5