టాలెంటెడ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మేఘ ఆకాష్. అందం, అభినయంతోనే మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమా తర్వాత చల్ మోహన్ రంగ సినిమాలో నటించింది. ప్రస్తుతం మేఘా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. అటు హీరోయిన్‌గా అవకాశాలు కొల్లగొడుతూనే, ఇతర సినిమాల్లోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.