పెరుగుతున్న విడాకుల కేసులు.. భారతదేశంలో నెంబర్ వన్ ఆ రాష్ట్రమే!
పెళ్లి అనేది నూరేళ్ల జీవితం, ఒకప్పుడు వివాహం జరిగింది అంటే చనిపోయే వరకు కలిసి ఉండే వాళ్లు కానీ,ఇప్పుడు పెళ్లై కనీసం నెల రోజులు కూడా కలిసి ఉండటం లేదు. ఈరోజుల్లో విడాకులనేది ఓ ట్రెండ్ అయిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు వివాహం చేసుకొని కొన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత అభిప్రాయాలు కలవడం లేదంటూ విడాకులిచ్చేస్తున్నారు.
Updated on: Jul 04, 2025 | 8:40 PM

పెళ్లి అనేది నూరేళ్ల జీవితం, ఒకప్పుడు వివాహం జరిగింది అంటే చనిపోయే వరకు కలిసి ఉండే వాళ్లు కానీ,ఇప్పుడు పెళ్లై కనీసం నెల రోజులు కూడా కలిసి ఉండటం లేదు. ఈరోజుల్లో విడాకులనేది ఓ ట్రెండ్ అయిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు వివాహం చేసుకొని కొన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత అభిప్రాయాలు కలవడం లేదంటూ విడాకులిచ్చేస్తున్నారు. అయితే భారత దేశంలో విడాకుల రేటుపై ఓ సర్వే చేయగా అందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయంట. కాగా, అసలు భారత దేశంలో ఏ రాష్ట్రంలో విడాకుల రేటు అధికంగా ఉందో చూద్దాం.

భారతదేశంలో అత్యధిక విడాకుల రేటు మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణ, అలాగే ఒత్తిడి, ఆర్థిక స్వాతంత్ర్యం వంటి కారణాల వలన మహారాష్ట్ర 18.7%తో విడాకుల రేటులో అగ్రస్థానంలో ఉంది. అదే విధంగా, కర్ణాటక రాష్ట్రం విడాకుల రేటులో రెండో స్థానంలో ఉంది.

పట్టణీకరణ పెరగడం, అలాగే జంటల మధ్య వ్యక్తిగత హక్కులపై అవగాహన ఎక్కువగా ఉండటం వలన కర్ణాటక రాష్ట్రం 11.7%తో విడాకుల రేటులో రెండో స్థానంలో ఉన్నదంట. అలాగే,ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా విడాకుల రేటు అధికంగానే ఉన్నదంటున్నారు నిపుణులు. చట్టపరమైన అవగాహన పెరగడం వలన ఈ రాష్ట్రంలో విడాకుల కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయంట. ప్రస్తుతం 8.8శాతంతో ఉత్తరప్రదేశ్ విడాకుల రేటులో మూడో స్థానంలో ఉంది.

పశ్చిమ బెంగాల్‌లో కూడా విడాకుల రేటు క్రమంగా పెరుగుతుందంట. ముఖ్యంగా కొల్ కత్తా వంటి పట్టణ కేంద్రాల్లో విడాకుల రేటు 8.2 శాతం ఉన్నట్లు సమాచారం. అధిక పని ఒత్తిడి, వేగవంతమైన జీవితం వంటివి, బంధాలపై పూర్తి అవగాహన లేక పోవడం ఇలా పలు కారణాల వలన విడాకుల కేసులనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయంట.

తమిళనాడులో ముఖ్యంగా చెన్నై వంటి మహానగరాల్లో కూడా విడాకుల రేటు గణనీయంగా పెరుగుతుందంట. విద్య, ఆర్థిక స్వేచ్ఛ, వలన ఈ విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయంట. తమిళనాడులో విడాకుల రేటు 7.1శాతంగా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో విడాకుల రేటు అనేది ఎక్కువగా పెరుగుతుందంట. ఇక్కడ కెరీర్, జీవనశైలి వంటి కారణాల వల విడాకుల కేసులు చాలా వరకు పెరుగుతున్నాయంట. ప్రస్తుతం తెలంగాణలో విడాకుల రేటు 6.7శాతంగా ఉంది.



















