- Telugu News Photo Gallery Mahadev pur zp high school students unique talent for in jayashankar bhupalpally district
Unique Talent: కంటితో మాట్లాడే భాష.. చెవితో ఆలకించి రాసే లిపి..గవర్నమెంట్ స్టూడెంట్స్ టాలెంట్‌కు గవర్నర్ ఫిదా
కంటితో మాట్లాడే భాష.. చెవితో ఆలకించి రాసే లిపిని ఎక్కడైనా చూశారా..? కంటి కదలికలు - చెవి స్వాబావాన్ని బట్టి లిపిని తయారుచేసిన మహదేవపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శబ్బష్ అనిపించుకుంటున్నారు..
G Peddeesh Kumar | Edited By: Surya Kala
Updated on: Aug 13, 2023 | 12:12 PM

ఈ విద్యార్థుల ప్రతిభ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.. స్థానిక ప్రజాప్రతినిదులు, అధికారులే కాదు సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కూడా అవాక్కయ్యారు.. శబ్బాష్ అని చప్పట్లు చరిచి శాలువాతో ప్రశంసించారు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు దేవిక,మల్లిక & రాజశేకర్ - నవదీప్ తన ప్రతిభను ప్రదర్శించి వాహ్ అని పిస్తున్నారు..వీరికి ఈ విద్య నేర్పిన గైడ్ టీచర్ మధు, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు అశోక్ విద్యార్థులలోని ప్రతిభను బాహ్య ప్రపంచానికి చాటారు.

ఐతే ఎలా కంటితో మాట్లాడుతారు..? ఎలా చేవుతో ఆలకిస్తారు..? రెప్పల కదలికలు, చెవి కదలికలతో ఎదుటివారు ఏం చెప్పారో అర్దం చేసుకొని రాయడం ఎలా సాధ్యం అనేదే సందేహం..? కంటి రెప్పల కదలికలను బట్టి లిపి వుంటుంది.. ఎదుటి విద్యార్థి కంటిరెప్పల కదలికలు, హావభావాలను బట్టి అక్షరాలను సమకూర్చుతారు..

ఎదుటి వ్యక్తి తన పేపర్ పై ఏది రాస్తే అది తన ఎదుట ఉన్న వ్యక్తి కనురెప్పల కదలికలు, తరంగాలను గమనించి అక్షరం పొల్లపోకుండా రాస్తారు..

ఈ విద్యార్థుల ప్రతిభ..,కనబరిచిన సృజనాత్మక,.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులైనా వారు ఇంగ్లీషు లో మాట్లాడే విధానం చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు..

ఇదే విదంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు నాణ్యమైన విద్యను నేర్చుకొని ప్రతిభావంతులు అయ్యి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.. ఈ ప్రతిభను వెలికి తీసి, మెరికల్లాంటి విద్యార్థులను ఎంతో మందిని తయారు చేయవలసిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులపై వుందని, ఆ ప్రయత్నం లో ఉపాధ్యాయులు అందరు విజయవంతం కావాలని గవర్నర్ తో సహా, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆకాక్షించారు.





























