- Telugu News Photo Gallery Low sodium symptoms: Sodium Level Low Can Cause Death, These Foods Keep In Diet
Sodium Deficiency: సరిపడా సోడియం తీసుకుంటున్నారా? లేదంటే కోమాలోకి వెళ్లడం ఖాయం..
కొన్నిసార్లు మనకు తెలియకుండానే హఠాత్తుగా తల తిరగడం మొదలవుతుంది. కళ్ళు అస్పష్టంగా ఉన్నట్లు అనిపించడం, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం..వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో సోడియం లేదా పొటాషియం లోపం ఉంటే ఇలా జరుగుతుంది. ఈ సమస్యలను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, కోమాలోకి వెళ్లడం, మరణానికి కూడా దారి తీస్తుంది. ప్రొటీన్లతో పాటు విటమిన్లు, సోడియం, పొటాషియం, కాల్షియం వంటి వివిధ మినరల్స్ కూడా శరీరాన్ని ఆరోగ్యంగా..
Updated on: Mar 27, 2024 | 12:49 PM

కొన్నిసార్లు మనకు తెలియకుండానే హఠాత్తుగా తల తిరగడం మొదలవుతుంది. కళ్ళు అస్పష్టంగా ఉన్నట్లు అనిపించడం, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం..వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో సోడియం లేదా పొటాషియం లోపం ఉంటే ఇలా జరుగుతుంది. ఈ సమస్యలను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, కోమాలోకి వెళ్లడం, మరణానికి కూడా దారి తీస్తుంది

ప్రొటీన్లతో పాటు విటమిన్లు, సోడియం, పొటాషియం, కాల్షియం వంటి వివిధ మినరల్స్ కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి లోపించినా తలతిరగడం, కడుపు ఉబ్బరం, కీళ్లనొప్పులు మొదలగు అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు.

సాధారణంగా 60 ఏళ్లు వచ్చిన తర్వాత శరీరంలో సోడియం లోపం మొదలవుతుంది. అందుకే 55 ఏళ్లు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సోడియం లక్షణాలు గుర్తిస్తే.. ముందస్తు హెచ్చరిక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ సోడియం స్థాయిల లక్షణాలు ఉన్నవారిలో నిరంతర తలనొప్పి, అలసట, ఆందోళన, వాంతులు, కండరాల తిమ్మిరి, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సోడియం లోపాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే, కొన్ని సాధారణ ఆహారాలతో లోపాన్ని సరిదిద్దవచ్చు.

సోడియం అంటే ఉప్పు. తెల్ల ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆహారంలో ఉప్పు కలుపుకుని తింటే సరిపడా సోడియం అందుంతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి. సోడియం అధికంగా ఉండే మరొక ముఖ్యమైన ఆహారం జున్ను. 100 గ్రాముల చీజ్‌లో దాదాపు 300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. కాబట్టి సోడియం లోపం ఉన్నవారు క్రమం తప్పకుండా జున్ను తింటే సరిపోతుంది.

రకరకాల కూరగాయలు తినడం వల్ల శరీరంలో సోడియం లోపం చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ వెజిటబుల్ సూప్ లేదా తాజా కూరగాయల సలాడ్లను తినాలి. శరీరంలో తక్కువ సోడియం స్థాయిలు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే అధిక సోడియం స్థాయిలు కూడా ప్రమాదకరమే. WHO ప్రకారం.. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సోడియం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.




