- Telugu News Photo Gallery Fig Benefits: Diabetes To Body Weight Control And Heamoglobin Can Increase By eating dry Fig
Fig Benefits: నానబెట్టిన అంజీర్ పండ్లు తింటే ఎన్ని లాభాలో.. మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట దివ్యౌషధం
నడుస్తున్నప్పుడు కాలు నొప్పి, కండరాల తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తే రక్తహీనత, కడుపు సమస్యలతో బాధపడుతున్నట్లు అర్ధం చేసుకోవాలి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రతిరోజూ ఉదయం 2 అంజీర్ పండ్లను నీళ్లలో నానబెట్టి తినాలి. అంజీర్ పండ్లను కొన్ని ప్రదేశాల్లో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన చిక్‌పీస్, బాదం, ఎండుద్రాక్ష తింటారు. అయితే అంజీర్ పండ్లు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి..
Updated on: Mar 27, 2024 | 1:08 PM

నడుస్తున్నప్పుడు కాలు నొప్పి, కండరాల తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తే రక్తహీనత, కడుపు సమస్యలతో బాధపడుతున్నట్లు అర్ధం చేసుకోవాలి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రతిరోజూ ఉదయం 2 అంజీర్ పండ్లను నీళ్లలో నానబెట్టి తినాలి. అంజీర్ పండ్లను కొన్ని ప్రదేశాల్లో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన చిక్‌పీస్, బాదం, ఎండుద్రాక్ష తింటారు. అయితే అంజీర్ పండ్లు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ధర కాస్త ఎక్కువైనా వీటిల్లోని బహుళ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అంజీర్ పండ్లలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తినడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను సక్రమం చేస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య ఉంటే ఇట్టే తొలగి పోతుంది.

అంజీర్ పండ్లలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కొన్ని అంజీర్ పండ్లను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం వాటిని తింటే ప్రొటీన్లు, వివిధ మినరల్స్ శరీరానికి అందుతాయి. రోజుకు కనీసం 2-3 అంజీర్ పండ్లను తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. రోజంతా చురుకుగా ఉంటారు.

అంజీర్ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడుతున్నవారు అంజీర పండ్లు తింటే రక్తం సమృద్ధిగా పడుతుంది. రక్తహీనత సమస్యను నయం చేసేందుకు ఈ హోం రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంజీర్ మొటిమలు, దద్దుర్లు వంటి వివిధ చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది. అత్తి పండ్లలోని కాల్షియం ఎముకలను దృఢంగా మారడంతో పాటు కండరాల తిమ్మిరి వంటి సమస్యలు తక్షణమే దూరం చేస్తుంది. బరువు తగ్గడంలోనూ ఉపయోగపడతాయి.

అంజీర్ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడుతున్నవారు అంజీర్ పండ్లను తినమని నిపుణులు సలహా ఇస్తారు. రక్తహీనత సమస్యను నయం చేసేందుకు ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మొటిమలు, దద్దుర్లు వంటి వివిధ చర్మ సమస్యలను కూడా అంజీర్ తొలగిస్తుంది. వీటిల్లోని క్యాల్షియం ఎముకలు దృఢంగా మారడంతో పాటు కండరాల తిమ్మిరి వంటి సమస్యలు తక్షణమే దూరం చేస్తాయి. ప్రధానంగా టైప్-2 మధుమేహం బారిన పడిన వారు ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.




