- Telugu News Photo Gallery Banana Benefits: Does Banana Increase quality sleep Time, Know Details here
Insomnia: రాత్రి పడుకునే ముందు అరటి పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
నేటి జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా చాలా మందికి కంటి నిండా నిద్ర కరువైపోతుంది. రాత్రిళ్లు నిద్రరాక తెల్లవారుజాము వరకు రాత్రంతా మేల్కొనే ఉంటున్నారు. దీంతో ఉదయాన్నే నీరసంగా నిద్ర మత్తు కళ్లతో ఉదయం ఆఫీసులకు వెళ్తుంటారు. మీ నిద్ర సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజుకో అరటి పండు తినాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే అందుకు ముందుగా రాత్రిపూట అస్సలు తినకూడదని ఆహారాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా కాఫీ, మద్యం, టీ, చీజ్, స్వీట్లు వంటి వాటిని రాత్రి..
Updated on: Mar 27, 2024 | 1:21 PM

నేటి జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా చాలా మందికి కంటి నిండా నిద్ర కరువైపోతుంది. రాత్రిళ్లు నిద్రరాక తెల్లవారుజాము వరకు రాత్రంతా మేల్కొనే ఉంటున్నారు. దీంతో ఉదయాన్నే నీరసంగా నిద్ర మత్తు కళ్లతో ఉదయం ఆఫీసులకు వెళ్తుంటారు. మీ నిద్ర సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజుకో అరటి పండు తినాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే అందుకు ముందుగా రాత్రిపూట అస్సలు తినకూడదని ఆహారాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా కాఫీ, మద్యం, టీ, చీజ్, స్వీట్లు వంటి వాటిని రాత్రి సమయంలో తినడం వల్ల నిద్ర కరువవుతుందట. వీటిని తింటే అస్సలు నిద్ర పట్టదని నిపుణులు అంటున్నారు. కానీ ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక్క అరటి పండు తింటే సరిపోతుంది

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (NICE) ప్రకారం.. చాలా మందికి నిద్ర సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి. నిద్ర మెదడుకే కాదు ఆరోగ్యవంతమైన శరీరానికి కూడా చాలా ముఖ్యం. ఇది మన మానసిక స్థితిని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. అలాగే, నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు బాగా నిద్రపోవాలంటే ట్రిప్టోఫాన్ ఉన్న ఆహారాన్ని తినాలి. నిద్రకు ఉపక్రమించే ముందు అరటిపండ్లు తింటే హాయిగా నిద్ర పడుతుందని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్స్ (RCOT) నిపుణులు అంటున్నారు.

ఈ పండు నిద్ర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే అరటిపండులో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. ట్రిప్టోఫాన్ ఒక రకమైన అమైనో ఆమ్లం. ఇది శరీరంలోని సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుం




