- Telugu News Photo Gallery Health Tips: What Is The Best Way To Avoid Dehydration, Follow These 5 Tips
Dehydration: శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాలి.. లేదంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే!
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు సరిపడా నీళ్లు తాగాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ రోజువారీ పనుల్లోపడి నీటిని సమృద్ధిగా నీళ్లు తాగరు. రోజంతా గడచిన తర్వాత ఎక్కువ నీరు తాగలేదనే విషయం గుర్తుంది. కానీ ఇలా మళ్లీ మళ్లీ జరిగితే, మీరు పెద్ద ఇబ్బందుల్లో పడతారు. అందుకే రోజంతా తగినంత నీరు త్రాగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని పెంచడానికి, నీటి శాతం ఎక్కువగా ఉండే కొన్ని రకాల..
Updated on: Mar 27, 2024 | 1:33 PM

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు సరిపడా నీళ్లు తాగాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ రోజువారీ పనుల్లోపడి నీటిని సమృద్ధిగా నీళ్లు తాగరు. రోజంతా గడచిన తర్వాత ఎక్కువ నీరు తాగలేదనే విషయం గుర్తుంది. కానీ ఇలా మళ్లీ మళ్లీ జరిగితే, మీరు పెద్ద ఇబ్బందుల్లో పడతారు.

అందుకే రోజంతా తగినంత నీరు త్రాగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని పెంచడానికి, నీటి శాతం ఎక్కువగా ఉండే కొన్ని రకాల పండ్లు, కూరగాయలను కూడా తినవచ్చు. అవసరమైతే, పండ్ల రసాలు కూడా తాగవచ్చు.

ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత 1 గ్లాసు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. రోజులో ప్రతి భోజనానికి కనీసం అరగంట ముందు ఒక గ్లాసు నీరు త్రాగాలి. ఇలా చేస్తే ఆహారం జీర్ణమవడంతోపాటు ఆహారంలోని పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి.

నిమ్మకాయ-పుదీనా లేదా దోసకాయ-తులసి ఆకులతో తయారు చేసిన నీటిని కూడా త్రాగవచ్చు. నీటి రుచి మారడంతో, మళ్లీ మళ్లీ నీరు తాగాలనే విషయం మీరు గుర్తుంచుకుంటారు. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా క్రమంగా అది అలవాటుగా మారుతుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అనేక వ్యాధుల నుంచి తేలిగ్గా బయటపడవచ్చు.

శరీరం హైడ్రేట్ గా ఉండాలంటే తాజా పండ్లు తినాలి. ఎండాకాలం వచ్చిందంటే చాలు పుచ్చకాయలు మార్కెట్‌లో అధికంగా దొరుకుతాయి. ప్రతిరోజూ కొన్ని పుచ్చకాయ ముక్కలు తినడానికి ప్రయత్నించాలి. పుచ్చకాలయలోని పోషకాలు శరీరంలో నీటి కొరతను తీరుస్తుంది.




