- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Birthday Special His Rare Photos Goes Viral telugu movie news
Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ బర్త్ డే.. రామ్ చరణ్ రేర్ ఫోటోస్ వైరల్..
మెగాస్టార్ వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు రామ్ చఱణ్. దాదాపు 17 ఏళ్ల క్రితం 'చిరుత'గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అల్లు సీతారామరాజుగా కోట్లాది మంది మనసులలో స్థానం సంపాదించుకున్నాడు. నటనరాదు అని విమర్శించిన వారితోనే 'రంగస్థలం'పై చప్పట్లు కొట్టింటుకున్నాడు. అప్పుడు విమర్శించిన వారే తిరిగి ప్రశంసలు కురిపించేలా కసిగా నటించి మెప్పించాడు.
Updated on: Mar 27, 2024 | 1:43 PM

మెగాస్టార్ వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు రామ్ చఱణ్. దాదాపు 17 ఏళ్ల క్రితం 'చిరుత'గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అల్లు సీతారామరాజుగా కోట్లాది మంది మనసులలో స్థానం సంపాదించుకున్నాడు.

నటనరాదు అని విమర్శించిన వారితోనే 'రంగస్థలం'పై చప్పట్లు కొట్టింటుకున్నాడు. అప్పుడు విమర్శించిన వారే తిరిగి ప్రశంసలు కురిపించేలా కసిగా నటించి మెప్పించాడు. మెగాస్టార్ వారసుడు అన్న పేరు కాకుండా గ్లోబల్ స్టార్ అనే క్రేజ్ అందుకున్నాడు.

ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన రేర్ ఫోటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మెగా ఫ్యాన్స్. చరణ్ రేర్ ఫోటోస్ ఒకసారి మీరు చూసేయ్యండి.

మగధీర సినిమాతో హిట్ అందుకున్నాడు చరణ్. కానీ ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా నిరూత్సాహాపరిచింది. కానీ ఈ మూవీ మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత హిట్టు, ప్లాపులు చరణ్ సినీ ప్రయాణంలో భాగమయ్యాయి.

రచ్చ, తుఫాన్, ధృవ, గోవిందుడు అందరివాడే, నాయక్ సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన ఎవడు మూవీతో మరో హిట్ అందుకున్నాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించిన రంగస్థలం గురించి చెప్పక్కర్లేదు.

రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో నవ్వించాడు.. అలాగే నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ పై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ పొగిడేశారు.

1985 మార్చి 27 జన్మించారు చరణ్. 10వ తరగతి వరకు సినిమాల గురించి తెలుసుకోవడానికి.. కనీసం మూవీ మ్యాగజైన్స్ చదవడానికి కూడా చిరు ఒప్పుకునేవారు కాదట. చెర్రీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే క్రికెట్ శిక్షణ తీసుకున్నారు.

ఆ తర్వాట నటనపై ఆసక్తి కలగడంతో చెన్నైలో ఓ ప్రముఖ యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. 2007లో చిరుత సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. అలాగే డ్యాన్స్ పరంగానూ అదుర్స్ అనిపించుకున్నారు చరణ్.

బాలీవుడ్ ఇండస్ట్రీలో జంజీర్ సినిమాతో అడుగుపెట్టారు చరణ్. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో బాలీవుడ్ క్రిటిక్స్ చరణ్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. నటన రాదని, హీరో ఫేస్ కాదంటూ కామెంట్స్ చేశారు.

కానీ జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో విమర్శించిన చోటే భేష్ అనిపించుకున్నారు. ఒకప్పుడు చరణ్ పై కామెంట్స్ చేసినవారే గ్లోబల్ స్టార్ యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.




