IRCTC : హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఉంచే ఆహ్లాదకర ప్రదేశాలు.. అతి తక్కువ ఖర్చుతో హాలీడే ప్యాకేజీ..!
IRCTC కేరళ టూర్: కేరళను సందర్శించేందుకు IRCTC ఒక గొప్ప టూర్ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. కేరళ హౌస్‌బోట్‌లు, జలపాతాలు ఇక్కడ ప్రత్యేక గుర్తింపు పొందాయి.
Updated on: Apr 06, 2023 | 9:32 PM

IRCTC కేరళ టూర్: గోవాలాగే కేరళ కూడా ప్రజలకు ఇష్టమైన ప్రదేశం. ప్రశాంత వాతావరణం, పచ్చదనం కోసం కేరళను సందర్శించడానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు. కేరళ హౌస్‌బోట్‌లు, జలపాతాలు ఇక్కడ ప్రత్యేక గుర్తింపు పొందాయి. కేరళను సందర్శించేందుకు IRCTC ఒక గొప్ప టూర్ ప్యాకేజీతో ముందుకు వచ్చింది.

IRCTC టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 11 నుండి ప్రారంభమవుతుంది. దీనిలో పర్యాటకులు అలెప్పీలోని జలపాతాలు, మున్నార్ పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తారు. పర్యాటకులు ఈ రెండు ప్రదేశాలకు రైలులో ప్రయాణించే అవకాశం మీ ముందుంది.

ఈ టూర్ ప్యాకేజీ గురించి వివరాలు పరిశీలించినట్టయితే.. ఇది రూ.11,980 నుండి ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ నుండి రైలు అందుబాటులో ఉంటుంది. రైలులో స్లీపర్, థర్డ్ ఏసీ క్లాస్ ద్వారా ప్రజలను కేరళకు తీసుకువెళతారు.

టూర్ బుక్ చేసుకున్న వారికి 3 బ్రేక్ ఫాస్ట్ లు కూడా ఇస్తారు. ముందుగా మున్నార్‌కు తీసుకువెళతారు. ఇక్కడ నేషనల్ పార్క్, టీ మ్యూజియం, ఎకో పాయింట్‌లకు చూపిస్తారు.

అదే సమయంలో, పర్యాటకులు అలెప్పీలో బ్యాక్ వాటర్స్‌ని ఎంజాయ్ చేయగలుగుతారు. మొత్తంమీద, IRCTC ఈ టూర్ ప్యాకేజీ ద్వారా ప్రజలు తక్కువ సమయంలో కేరళలోని రెండు అద్భుతమైన ప్రదేశాలను ఆస్వాదించగలరు.




