- Telugu News Photo Gallery Lemon Has Many Health Benefits From Reducing Skin Problems To Keeping Kidney Healthy
Lemon Benefits: ఈ ఒక్కటి తింటే జీవితంలో కిడ్నీ సమస్యలు రావు.. అస్సలు మిస్ చేయకండి..
సీజన్ మారుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే పొడి చర్మం, చుండ్రు సమస్యలు వెంటాడుతాయి. అయితే ఈ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఏడాది పొడవునా మార్కెట్‌లో లభించే పండ్లలో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి చర్మం కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఫలితంగా చర్మం త్వరగా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టదు. కణాల గాయం నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో నిమ్మకాయ తీసుకుంటే చర్మం డల్ గా కనిపించదు..
Updated on: Feb 11, 2024 | 7:25 PM

సీజన్ మారుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే పొడి చర్మం, చుండ్రు సమస్యలు వెంటాడుతాయి. అయితే ఈ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఏడాది పొడవునా మార్కెట్‌లో లభించే పండ్లలో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి చర్మం కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఫలితంగా చర్మం త్వరగా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టదు. కణాల గాయం నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో నిమ్మకాయ తీసుకుంటే చర్మం డల్ గా కనిపించదు.

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కాల్ప్ కరుకుదనాన్ని తొలగిస్తుంది. సిట్రిక్ యాసిడ్ చుండ్రును తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి నిమ్మరసాన్ని రెగ్యులర్‌గా తలకు పట్టించడం వల్ల చుండ్రు నుంచి బయటపడవచ్చు. నిమ్మకాయలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

జీర్ణ సమస్యలకు నిమ్మకాయను 'సూపర్ హీరో' అంటారు. నిమ్మరసం మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా నిమ్మకాయ శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగిస్తుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు తగ్గే విషయానికి వస్తే నిమ్మకాయలకు మించిన మరో ఆప్షన్ లేదు. నిమ్మకాయలో పెక్టిన్ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. నిమ్మకాయలోని ఫ్లేవనాయిడ్లు జీవక్రియను పెంచుతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Lemon

నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఫలితంగా ఫ్లూ, జలుబుతో బాధపడే అవకాశం తగ్గుతుంది. అదనంగా, నిమ్మకాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.




