బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ రాముడిగా, ఈమె సీతగా నటించిన ఆదిపురుష్ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా కంటే ముందు కృతి సనన్.. మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.