AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంధ్యత్వం పెరగడానికి కారణమేంటి..? స్త్రీ, పురుషులు ఎలా చెక్ పెట్టాలంటే.. సింపుల్ టిప్స్..

ఉరుకులు పరుగుల జీవితం.. పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం.. ఇవన్నీ ఎన్నో సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి.. అయితే.. మధ్య కాలంలో వంధ్యత్వం (సంతానం కలగకపోవడం) సమస్య పెరుగుతోంది.. చాలామంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Aug 18, 2024 | 4:02 PM

Share
ఉరుకులు పరుగుల జీవితం.. పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం.. ఇవన్నీ ఎన్నో సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి.. అయితే.. మధ్య కాలంలో వంధ్యత్వం (సంతానం కలగకపోవడం) సమస్య పెరుగుతోంది.. చాలామంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానం కావాలనే వారి కల.. కలగానే మిగిలిపోతోంది.. దీంతో జంటలు మానసికంగా ఆవేదన చెందుతున్నారు. అయితే.. సంతానలేమి అనేది.. మహిళలకు మాత్రమే సంబంధించినది కాదు. ఇది భార్యాభర్తల ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది.

1 / 6
వంధ్యత్వానికి సాధారణ కారణాలు..  సాధారణ అండోత్సర్గము లేకపోవడం (నెలవారీ గుడ్డు విడుదల), నాణ్యత లేని వీర్యం అని వైద్యులు పేర్కొంటుంటారు.. వంధ్యత్వానికి గల కారణాల గురించి భార్యాభర్తలిద్దరూ శారీరక పరీక్ష చేయించుకుని, తదనుగుణంగా చికిత్స తీసుకోవాలి. అయితే వంధ్యత్వం ఎందుకు పెరుగుతోంది? దీన్ని ఎలా నియంత్రించాలో.. మనం ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
సాధారణంగా వంధ్యత్వానికి గల ప్రధాన కారణం.. స్త్రీలు లేదా పురుషుల్లో లోపాన్ని చూపిస్తుంది.. ఒక్కోసారి ఒక్కరిలో.. లేదా ఇద్దరిలో కూడా కనిపిస్తుంది.. అయితే.. మనం తినే ఆహార పదార్థాలు కూడా వంధ్యత్వానికి కారణమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. తినే ఆహారంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది..

3 / 6
బయటి, ప్యాకెట్ ఆహారాలు, అలాగే వేయించిన ఆహారాలు, చక్కెర జోడించిన ఆహారాల వినియోగాన్ని తగ్గించండి. రోజూ మీ ఆహారంలో 1 పండు, 2 కప్పుల ఆకుకూరలు చేర్చుకోండి. ఇంకా మంచి ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోండి.. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. 30 నిమిషాల వ్యాయామం లేదా యోగా లాంటివి తప్పకుండా చేయండి.

4 / 6
మహిళలు పీరియడ్స్ సమయంలో సీడ్ సైక్లింగ్ అవలంభించాలి.. అంటే.. సీడ్ సైక్లింగ్‌లో హార్మోన్ల సమతుల్యత కోసం మీ ఋతు చక్రం అంతటా అవిసె, గుమ్మడికాయ, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు లాంటి పోషక పదార్థాలను తినాలి.. పురుషులు రోజుకు 3 వాల్‌నట్‌లు తినాలి.. భార్యాభర్తలిద్దరూ మంచి పోషకాహారం తీసుకుని శృంగారంలో పాల్గొనాలి..

5 / 6
ఆలస్య వివాహం లేదా పిల్లల ప్రణాళిక వంధ్యత్వానికి కారణం అనేది అపోహ మాత్రమే.. ఊబకాయం వల్ల సంతానలేమి కలుగుతుందనేది కూడా అబద్ధం. వైవాహిక కలహాలు, ఒత్తిడి వల్ల సంతానలేమి కలుగుతుందని చెప్పడం కూడా తప్పు.. ఇలాంటి సందర్భంలో వైద్య నిపుణులను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవాలి.. పురుషులలో తక్కువ స్పెర్మ్ కౌంట్ లేదా తక్కువ నాణ్యత గల స్పెర్మ్ వంధ్యత్వానికి లేదా సంతానోత్పత్తి లోపానికి దారితీస్తుంది. కావున చాలా ఎళ్లుగా సంతానం కలగకపోతే.. ఆ దంపతులు వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి..

6 / 6