- Telugu News Photo Gallery Business photos Here is the step by step process to reactivate your lapsed LIC Policy, check details in telugu
LIC Policy: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా? సింపుల్‌గా మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు.. అదెలా అంటే..
లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)అంటే మన దేశంలో అమితమైన నమ్మకం. కేంద్ర ప్రభుత్వ భరోసా ఉండటంతో అందరూ దీనిలో నమ్మకంగా పాలసీలు తీసుకుంటారు. అయితే వీటిల్లో పథకాలు అన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిచేవిగా ఉంటాయి. కొన్ని సంవత్సరాల పాటు పాలసీల ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. అలా మధ్యలో ఏదైనా ప్రీమియంలు చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. మరి అలాంటి సమయంలో ఏం చేయాలి? తిరిగి దానిని రీ యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..
Updated on: Aug 18, 2024 | 5:56 PM

రెండేళ్ల వరకూ అవకాశం.. ఎల్ఐసీ తన వినియోగదారుల కోసం వివిధ దీర్ఘకాలిక పథకాలను అందిస్తుంది. అయితే, మీరు ఎక్కువ కాలం పాటు మీ ప్రీమియంలను చెల్లించడం మానేస్తే.. మీ పాలసీ రద్దు కావచ్చు. అదృష్టవశాత్తూ, ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించడానికి ఎల్ఐసీ రెండు సంవత్సరాల విండోను అందిస్తుంది.

ఏం చేయాలంటే.. పాలసీని పునరుద్ధరించడానికి, వర్తించే వడ్డీతో పాటు చెల్లించాల్సిన అన్ని ప్రీమియంలను తప్పనిసరిగా చెల్లించాలి. ఎల్ఐసీ ఏజెంట్ లేదా బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా పాలసీదారు పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అలాగే కస్టమర్ సర్వీస్ కు కాల్ చేయడం ద్వారా ప్రక్రియ గురించి విచారించవచ్చు.

అన్ క్లెయిమ్డ్ అమౌంట్.. కొన్ని సందర్భాల్లో పాలసీదారులు వివిధ కారణాల వల్ల ప్రీమియంలు చెల్లించలేకపోవచ్చు లేదా వారి పాలసీని సరెండర్ కూడా చేయకపోవచ్చు. అటువంటి సందర్భాలలో, డబ్బు క్లెయిమ్ చేయని మొత్తంగా ఎల్ఐసీ వద్ద ఉంటుంది.

క్లయిమ్ చేసుకోవచ్చు.. పాలసీదారు మరణించినట్లయితే,నామినీ అనేక సంవత్సరాల పాటు మొత్తాన్ని క్లెయిమ్ చేయకపోతే, డబ్బు అన్‌క్లెయిమ్డ్ గా ఉండిపోతుంది.క్లెయిమ్ చేయని ఈ మొత్తాలను చెక్ చేసుకునే సదుపాయాన్ని ఎల్ఐసీ అందిస్తుంది. అందుకోసం ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఎలా తనిఖీ చేయాలంటే.. ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి, కిందికి స్క్రోల్ చేయండి.. అక్కడ “అన్ క్లెయిమ్డ్ అమౌంట్స్ ఆఫ్ పాలసీ హోల్డర్స్” ఎంపికను ఎంచుకోండి. మీరు పాలసీ నంబర్, పాలసీదారు పేరు, పుట్టిన తేదీ,పాన్ కార్డ్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత, "సబ్మిట్" బటన్ క్లిక్ చేయండి. మీ పాలసీకి సంబంధించి ఏదైనా క్లెయిమ్ చేయని డబ్బు ఉంటే, అది స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది. మీరు దానిని క్లెయిమ్ చేసుకోవచ్చు.




