క్యాచ్‌లు పడితేనే.. మ్యాచ్‌లు గెలుస్తారు అనే నానుడి క్రికెట్‌లో ఉంది. ఇలాంటివి ఇప్పటి వరకు చాలా మ్యాచ్‌లు కూడా చూశాం. అయితే, విరాట్ కోహ్లీకి బ్యాట్‌తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడని తెలిసిందే. కానీ, కోహ్లీ మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌లో క్యాచ్‌లు తీసుకోవడంలో చెత్త రికార్డ్ నమోదు చేశాడు. గత ఐదేళ్లుగా వెలువడుతున్న లెక్కల విషయంలో విరాట్ కోహ్లీ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఈ కాలంలో అతని రికార్డు ఇతర భారత ఆటగాళ్లతో పోలిస్తే చెత్తగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో, విరాట్ కోహ్లీ క్యాచ్‌లు తీసుకోలేదనడానికి 2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఉన్న డేటా చూపిస్తుంది.