- Telugu News Photo Gallery Cricket photos Maharaja Trophy 2024, Despite Abhinav Manohar Splendid Innings, Mangaluru Dragons Beat Shivamogga Lions By 8 Wickets
34 బంతుల ఊచకోత.. 9 సిక్సర్లతో హార్దిక్ ఫ్రెండ్ శివతాండవం.. ఎవరంటే.?
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన షిమోగా జట్టు.. అభినవ్ మనోహర్ ఒంటరి పోరాటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. రోహన్ పాటిల్ హాఫ్ సెంచరీతో ఈ లక్ష్యాన్ని ఛేదించిన..
Updated on: Aug 18, 2024 | 11:49 AM

బెంగళూరు వేదికగా జరుగుతున్న మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లోని ఐదో మ్యాచ్‌లో షిమోగా, మంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మంగళూరు 22 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో షిమోగాపై అద్భుత విజయం సాధించింది మంగళూరు టీం.

ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన షిమోగా జట్టు.. అభినవ్ మనోహర్ ఒంటరి పోరాటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. రోహన్ పాటిల్ హాఫ్ సెంచరీతో ఈ లక్ష్యాన్ని ఛేదించిన అత్యంత సునాయాసంగా చేధించింది మంగళూరు డ్రాగన్స్ టీం.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన షిమోగా జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌గా వచ్చిన జట్టు కెప్టెన్ నిహాల్ ఉల్లాల్ సున్నాకి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ రోహిత్ 20 బంతుల్లో 4 బౌండరీలతో 24 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. మూడో స్థానంలో వచ్చిన ధృవ్ 20 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు ఆరంభం స్టార్టింగ్‌లో మందకొడిగా సాగింది.

అభినవ్ మనోహర్ పిడుగులాంటి బ్యాటింగ్‌తో జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. అభినవ్ ఒంటిచేత్తో 34 బంతుల్లో 3 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు చేశాడు. అటు 21 బంతుల్లో 22 పరుగులు చేసిన అవినాష్ కూడా అతనికి మంచి సహకారం అందించాడు. దీంతో ఆ జట్టు 175 పరుగులు చేసింది.

ఈ లక్ష్యాన్ని ఛేదించిన మంగళూరు జట్టుకు ఓపెనర్లు పేలుడు ఆరంభాన్ని అందించారు. దీంతో ఆ జట్టు తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలో 75 పరుగులు చేసింది. ఈ సమయంలో మెక్‌నీల్ హ్యాడ్లీ నొరోన్హా 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

మరో ఓపెనర్ రోహన్ పాటిల్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. చివర్లో 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 38 పరుగులు చేసిన కె. సిద్ధార్థ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.




