- Telugu News Photo Gallery Cricket photos Harsha Bhogle Key Comments On Hardik Pandya's T20 Captaincy Potential
Team India: స్కై కాదు.. టీ20లకు అసలైన కింగ్ ఆ ప్లేయరే.. ఎవరంటే.?
శ్రీలంక సిరీస్‌కు ముందు టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టాడు. నిజానికి టీ20 ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యా టీ20 జట్టు కెప్టెన్సీకి అందుకుంటాడని అందరూ ఊహించారు.
Updated on: Aug 18, 2024 | 10:58 AM

2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత టీ20 జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించగా.. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. వీటన్నింటితో పాటు సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా నియమించడం అతిపెద్ద మార్పు అని చెప్పొచ్చు.

శ్రీలంక సిరీస్‌కు ముందు టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టాడు. నిజానికి టీ20 ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యా టీ20 జట్టు కెప్టెన్సీకి అందుకుంటాడని అందరూ ఊహించారు. కానీ బీసీసీఐ వేరే ప్లాన్‌ని రూపొందించింది. కెప్టెన్‌గా స్కైని నియమించింది.

నివేదికల ప్రకారం, సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టుకు శాశ్వత కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. అయితే తాజాగా కామెంటేటర్ హర్షా భోగ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. స్కైని తీసేసి.. హార్దిక్ పాండ్యాను T20 జట్టుకు మళ్లీ కెప్టెన్‌గా నియమించవచ్చునని చెప్పాడు.

హర్ష భోగ్లే ప్రకారం, హార్దిక్ పాండ్యా మరోసారి భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా మారగలడు. వైట్-బాల్ మ్యాచ్‌లు ఆడమని మేనేజ్‌మెంట్ హార్దిక్‌ను సూచించడంతో.. మరోసారి అతడికే టీ20 కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వొచ్చునని తెలిపాడు.

ప్రయోగాత్మకంగా టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారని హర్షా భోగ్లే చెప్పాడు. పరిమిత ఓవర్లలో హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ నిరూపించుకుంటే, అతనికే మరోసారి పరిమిత ఓవర్ల కెప్టెన్సీని ఇవ్వడం ఖాయమన్నారు.

మరి హర్ష భోగ్లే వ్యాఖ్యలు ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాలి.? అటు లంక పర్యటనకు ముందు విలేకరుల సమావేశంలో సూర్యకు కెప్టెన్సీ ఇవ్వడం గురించి మాట్లాడిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, T20 కెప్టెన్సీకి సూర్యకుమార్ యాదవ్ ఉత్తమ ఎంపిక. ఇప్పటికే తన ప్రతిభను స్కై కనబరిచాడని చెప్పుకొచ్చాడు.

అదే సమయంలో అగార్కర్ కూడా హార్దిక్ గురించి కీలక ప్రకటన చేసాడు, హార్దిక్ కూడా మాకు ముఖ్యమైన ఆటగాడు. అతనిలాంటి ప్రతిభ దొరకడం కష్టం. అయితే గత రెండేళ్లుగా అతడి ఫిట్‌నెస్ పెద్ద సవాల్‌గా మారింది. అటువంటి పరిస్థితిలో, కెప్టెన్‌గా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే, తన పాత్రను చక్కగా పోషించగల ఆటగాడిని మేము కోరుకున్నాము. స్కైకి ఆ లక్షణాలన్నీ ఉన్నాయని తెలిపాడు అజిత్ అగార్కర్.




